తిరుప్పరంకుండ్రం కొండపై కార్తీక దీపం తీర్పులో సుప్రీంకోర్టు హద్దుమీరింది – TVK, కాంగ్రెస్, ఎండీఎంకే (MDMK) పార్టీలు మిత్రపక్షం ఆగ్రహం..!
తిరుప్పరంకుండ్రం కొండపై కార్తీక దీపం వెలిగించేందుకు ముమ్మర ఏర్పాట్లు జరుగుతున్న వేళ, తమిళనాడు రాజకీయాల్లో ఈ అంశం తీవ్ర దుమారం రేపుతోంది…విజయ్ నేతృత్వంలోని టీవీకే (TVK) మిత్రపక్షాలైన కాంగ్రెస్, ఎండీఎంకే (MDMK) పార్టీలు సుప్రీంకోర్టు తీర్పును తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయి. ఈ తీర్పు విషయంలో దేశ అత్యున్నత న్యాయస్థానం తన పరిధిని దాటి హద్దుమీరి వ్యవహరించిందని ఎండీఎంకే ప్రధాన కార్యదర్శి వైకో సంచలన వ్యాఖ్యలు చేశారు. భారత రాజ్యాంగానికి సెక్యులరిజం ప్రధాన పునాది అని గుర్తుచేసిన ఆయన, తాజా ఆదేశాలతో శతాబ్దాలుగా ఆ ప్రాంతంలో కొనసాగుతున్న మత సామరస్యానికి, సంప్రదాయానికి తీవ్ర భంగం కలిగిందని ఆవేదన వ్యక్తం చేశారు.