రాష్ట్రంలోని అర్హత కలిగిన ప్రతి పేదవాడికి సొంత ఇంటి నిర్మాణం చేసేందుకు తెలంగాణ సర్కార్ ఇందిరమ్మ ఇండ్ల పథకంను అమలు చేస్తోంది. మొత్తం 20లక్షల ఇందిరమ్మ ఇండ్లు కట్టివ్వాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. ఇందులో భాగంగా ఇప్పటి వరకు రెండు దశల్లో రాష్ట్రవ్యాప్తంగా 3లక్షల ఇండ్లను మంజూరు చేసింది. వీటిలో 1,36,390 ఇండ్లకు సంబంధించి పనులు మొదలయ్యాయి. 1,347 ఇండ్లు స్లాబ్స్ పూర్తిచేసుకున్నాయి. 20,075 ఇండ్లు బేస్ మెంట్ పూర్తికాగా.. 3,871 ఇండ్లు గోడలు పూర్తయ్యాయి..ఎలాంటి పొరపాట్లు జరగకుండా రాష్ట్ర ప్రభుత్వం ఇందిరమ్మ ఇండ్ల పథకాన్ని పకడ్బంధీగా అమలు చేస్తుంది. తొలి దశలో సొంతంగా ఇంటి జాగా ఉండి.. పక్కా ఇల్లులేని పేదలను మాత్రమే ప్రభుత్వం ఎంపిక చేసింది. కేవలం 400 నుంచి 600 చదరపు అడుగుల్లో మాత్రమే ఇందిరమ్మ ఇల్లు నిర్మించుకోవాలనే నిబంధన పెట్టడం ద్వారా కేవలం పేదలకు మాత్రమే ఇండ్లు దక్కేలా అధికారులు చూస్తున్నారు. మొదటి, రెండు విడతల్లో మొత్తం 3లక్షల ఇండ్లను మంజూరు చేయగా.. వాటిని స్పీడప్ చేయడంపై సర్కార్ ఫోకస్ పెట్టింది.
ఇందిరమ్మ ఇండ్ల పథకంకు నిధుల కొరత రాకుండా ప్రభుత్వం పడక్బంధీగా ముందుకుపోతుంది. ఇందులో భాగంగా గ్రీన్ చానల్ ద్వారా కేటాయింపులు చేస్తుంది. బేస్ మెంట్, గోడలు, స్లాబ్, ఇంటి నిర్మాణం పూర్తి చేసిన లబ్ధిదారులకు ఆయా దశలను బట్టి ప్రతిసోమవారం వారి బ్యాంక్ ఖాతాల్లో నిధులను జమ చేస్తుంది. ఇప్పటి వరకు 16,563 మంది లబ్ధిదారులకు
ఆయా దశలను బట్టి ప్రతిసోమవారం వారి బ్యాంక్ ఖాతాల్లో నిధులను జమ చేస్తుంది. ఇప్పటి వరకు 16,563 మంది లబ్ధిదారులకు రూ.173.98 కోట్లు వారి బ్యాంక్ ఖాతాల్లో ప్రభుత్వం జమ చేసింది. అదే సమయంలో ఇండ్ల నిర్మాణం ప్రారంభించేందుకు చేతిలో డబ్బులు లేని వారికి మహిళా సంఘాల నుంచి రూ.లక్ష రుణాన్ని సైతం ప్రభుత్వం ఇప్పిస్తుంది.