ప్రస్తుతం ప్రపంచం సోషల్ మీడియాపై నడుస్తోంది. ఉదయం లేచిన దగ్గర నుంచి రాత్రి పడుకునే వరకూ సామాజిక మాధ్యమాలతోనే గడుపుతున్నారు. అంత మనిషి జీవితంలో సోషల్ మీడియా భాగమైపోయింది. అలాంటిది గత కొన్ని రోజులుగా 25 నుంచి భారత్లో ఇన్స్టాగ్రామ్ను నిషేధించినట్లు ఒక వార్త వైరల్ అవుతోంది. ఈ వార్తతో లక్షలాది మంది ఇన్స్టాగ్రామ్ వినియోగదారుల ఆందోళనకు గురవుతున్నారు. అయితే ఈ ప్రచారంపై కేంద్ర ప్రభుత్వం తాజాగా స్పష్టత ఇచ్చింది. ఈ వార్త పూర్తిగా అవాస్తవమని, ఎలాంటి నిషేధ నిర్ణయం తీసుకోలేదని ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో (PIB) ఫ్యాక్ట్ చెక్ విభాగం.
అసత్య ప్రచారాలు నమ్మవద్దు.
సోషల్ మీడియాలో వచ్చే ఆధారాలు లేని వార్తలను, అనుమానాస్పద పోస్టులను గుడ్డిగా నమ్మవద్దని పీఐబీ ఫ్యాక్ట్ చెక్ యూనిట్ పౌరులకు విజ్ఞప్తి చేసింది. కేంద్ర ప్రభుత్వానికి సంబంధించిన ఏదైనా వార్త లేదా పోస్ట్పై సందేహం ఉంటే దాని ప్రామాణికతను ధృవీకరించుకోవడానికి పీఐబీ ఫ్యాక్ట్ చెక్ బృందానికి పంపవచ్చని తెలిపింది.