జూరాల గేట్లు మూసివేత….

ప్రియదర్శిని జూరాల ప్రాజెక్టుకు ఎగువ ప్రాంతం నుండి వస్తున్న వరద ఉధృతి తగ్గుముఖం పట్టింది. శుక్రవారం ఉదయం నాటికి జూరాల జలాశయంలో 317.790 మీటర్ల స్థాయి లో 8.203 టీఎంసీల నీరు నిల్వ ఉండగా, ఎగువ ప్రాంతం నుండి 65 వేల క్యూసెక్కుల వరద నీరు వచ్చి చేరుతోంది. దీంతో బుధవారం ఉదయం 7.20 గంటల ప్రాంతంలో జూరాల అధికారులు ప్రాజెక్టు గేట్లన్నింటిని మూసివేశారు. ఎగువ ప్రాంతం నుండి వస్తున్న వస్తున్న వరద నీటిలో జలవిద్యుత్ ఉత్పత్తికి 41,513 క్యూసెక్కులు, కుడి, ఎడమ కాలువలకు, ఎత్తిపోతల పథకాలకు వరద నీటిని వినియోగించుకుంటున్నట్టు జూరాల వరద నియంత్రణ కార్యాలయ అధికారులు తెలిపారు. ఎగువ ప్రాంతంలోని ఆల్మట్టి, నారాయణపూర్ జలాశయాలకు కూడా వరదనీటి ఉధృతి తగ్గుముఖం పట్టినట్టు జూరాల అధికారులు తెలిపారు.