ఇంటర్‌ పరీక్షలు ప్రారంభమైన తొలిరోజే పలు సమస్యలు..!

ఇంటర్‌ పరీక్షలు ప్రారంభమైన తొలిరోజే పలు సమస్యలు ఉత్పన్నమయ్యాయి. పరీక్షకు హాజరైన విద్యార్థులకు ఒక పేపర్‌కు బదులు మరో పేపర్‌ ఇచ్చిన ఘటనలు వెలుగుచూశాయి. తొలిరోజు సంస్కృతం పేపర్‌కు బదులు హిందీ ప్రశ్నపత్రాలు ఇచ్చారు. హనుమకొండ, మహబూబ్‌నగర్‌ జిల్లాల్లో ఓ ఇద్దరు విద్యార్థులకు సంస్కృతానికి బదులు హిందీ ప్రశ్నపత్రాలు ఇచ్చారు. పరీక్ష ముగిసిన తర్వాత విద్యార్థులు టెన్షన్‌పడ్డారు.

లిరోజు రెండో భాష పేపర్‌ 1కు తెలుగు, హిందీ, సంస్కృతం, ఉర్దూ, అరబిక్‌ పేపర్లకు పరీక్షలు జరిగాయి. పరీక్షకు హాజరైన కొందరు విద్యార్థులకు ఒక పేపర్‌కు బదులు మరో పేపర్‌ వచ్చిన ఘటనలు వెలుగుచూశాయి. హనుమకొండ, మహబూబ్‌నగర్‌ జిల్లాల్లో జరిగిన పరీక్షల్లో ఇద్దరు విద్యార్థులకు సంస్కృతం ప్రశ్నాపత్రంకి బదులు హిందీ ప్రశ్నపత్రాలు అందించారు. పరీక్ష ముగిసిన తర్వాత విద్యార్థులు ఈ విషయం తమ తల్లిదండ్రులకు తెలియజేసి టెన్షన్‌పడ్డారు. దీంతో తల్లిదండ్రులు అధికారులకు ఫిర్యాదు చేయడంతో విషయం వెలుగులోకి వచ్చింది. బాధ్యులైన వారికి మెమో ఇవ్వాలని డిమాండ్‌ చేశారు..

విషయంపై తల్లిదండ్రులు అధికారులకు ఫిర్యాదు చేశారు. బాధ్యులైన వారికి మెమో ఇవ్వాలని డిమాండ్‌చేశారు. కాగా, పలు చోట్ల నాలుగైదు నిమిషాలు ప్రశ్నపత్రాలు ఆలస్యంగా అందాయి. చాలా జిల్లాల్లో ఆయా సెంటర్లల్లో నిర్దేశిత సమయం కన్నా ఆలస్యంగా ప్రశ్నపత్రాలు చేరాయి. ఖమ్మం జిల్లాల్లోని కొన్ని సెంటర్లలో 10 నిమిషాలు ఆలస్యమైనట్టు తెలిసింది. దీంతో ఇంటర్‌బోర్డు అప్రమత్తమైంది.

నిర్దేశిత సమయం కన్నా.. ఐదు నిమిషాల ముందే పోలీస్‌స్టేషన్ల నుంచి ప్రశ్నపత్రాలను స్వాధీనం చేసుకోవాలని ఇంటర్‌బోర్డు ఆదేశించింది. సహజంగా ప్రశ్నపత్రాలను ఉదయం 8:30 గంటలకు అధికారులు పోలీస్‌స్టేషన్ల నుంచి తీసుకుంటారు. అయితే గ్రేటర్‌ సహా కొన్ని ప్రాంతాల్లో ట్రాఫిక్‌ సమస్య తలెత్తింది. పోలీస్‌స్టేషన్ల నుంచి సెంటర్లు దూరంగా ఉండటం కూడా సమస్యగా మారింది. ఈ నేపథ్యంలో ఉదయం 8:25గంటలకే పేపర్లను స్వాధీనం చేసుకోవాలని అధికారులు సూచించారు.