ఢిల్లీ క్యాపిటల్స్(Delhi Capitals) వరసగా రెండో విజయం..

పంతొమ్మిదో సీజన్‌లో ఇంప్యాక్ట్ సబ్ సమీర్ రిజ్వీ(90) జోరుతో ఢిల్లీ క్యాపిటల్స్(Delhi Capitals) వరసగా రెండో విజయంతో మురిసింది. సొంత మైదానంలో రిజ్వీ దూకుడు ముందు ముంబై ఇండియన్స్ (Mumbai Indians) బౌలర్లు తేలిపోగా.. 163 పరుగుల లక్ష్యాన్ని ఢిల్లీ ఉఫ్‌మనిపించింది. ఆరంభంలోనే రెండు వికెట్లు పడినా ఒత్తిడికి లోనవ్వని రిజ్వీ ఓపెనర్ పథుమ్ నిశాంక(44)తో కలిసి జట్టు విజయానికి బాటలు వేశాడు. ఈ హిట్టర్‌కు డేవిడ్ మిల్లర్‌(21 నాటౌట్) మెరుపులు తోడవ్వగా.. 18.1 ఓవరల్లోనే మ్యాచ్‌ను ముగించింది…ఐపీఎల్ పంతొమ్మిదో సీజన్‌లో ఛేజింగ్ జట్లు విజయదుంధుబి మోగిస్తున్నాయి. తమ సొంత ఇలాకాఆరుణ్ జైట్లీ స్టేడియంలో పంజా విసిరిన ఢిల్లీ క్యాపిటల్స్ పటిష్టమైన ముంబై ఇండియన్స్‌ను చిత్తుగా ఓడించింది. తొలుత ప్రత్యర్ధిని 163కే కట్టడి చేసింది ఢిల్లీ