ముంబై ఇండియ‌న్స్ పై ఆర్‌సిబి విజయం..!

షహీద్ వీర్ నారాయణ్ సింగ్ స్టేడియంలో ఐపీఎల్ మ్యాచ్‌ను వీక్షించే అవకాశం రాయ్‌పూర్ ప్రేక్షకులకు లభించి పదేళ్లు గడిచింది. 200కు పైగా స్ట్రైక్ రేట్లు, 230 పరుగుల ఛేజింగ్‌లు ఉండే ఆ కాలంలో, బౌలర్ల ఆధిపత్యం చెలాయించిన ఒక ఉత్కంఠభరితమైన పోటీని స్థానిక అభిమానులు వీక్షించారు.

ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2026 టోర్నమెంట్ లో ముంబై ఇండియన్స్ శకం పూర్తయింది. నిన్న బెంగళూరు చేతిలో చిత్తుగా ఓడిన ముంబై ఇండియన్స్, టోర్నమెంట్ నుంచి తప్పుకోవాల్సి వచ్చింది. రాయల్ చాలెంజర్స్ బెంగళూరు వర్సెస్ ముంబై ఇండియన్స్ మధ్య నిన్న రాయిపూర్ వేదికగా బిగ్ ఫైట్ జరిగింది. ఇందులో అద్భుతంగా రాణించిన రాయల్ చాలెంజర్స్ బెంగళూరు చివరి బంతికి విజయాన్ని నమోదు చేసుకుంది. దీంతో ముంబై పైన రెండు వికెట్ల తేడాతో విక్టరీ అందుకున్న బెంగుళూరు.. పాయింట్ల పట్టికలో మొదటి స్థానానికి చేరుకుంది.

చివరి బంతికి కూడా ముంబై ఇండియన్స్ భారీ తప్పిదం
రాయల్ చాలెంజర్స్ బెంగళూరు చేజింగ్ చేస్తున్న సమయంలో చివరి ఓవర్ రాజ్ బ‌వా వేశాడు. బంతులు అద్భుతంగా వేసినప్పటికీ.. రనౌట్ చేసే అవకాశాన్ని మిస్ చేశాడు. చివరి బంతికి రెండు పరుగులు చేయాల్సిన సమయంలో… రసిక్ బ్యాటింగ్ లో ఉన్నాడు. భువనేశ్వర్ కుమార్ మరో ఎండ్ లో ఉన్నాడు. రాజ్ బ‌వా చివరి బంతి సంధించాడు. అయితే, ఆ బంతి వికెట్ల నుంచి నేరుగా బౌండరీ గేటు దగ్గర ఉన్న ఫీల్డర్ దగ్గరికి వెళ్లింది. ఆ సమయంలో రెండు పరుగుల కోసం బెంగళూరు బ్యాటర్లు ప్రయత్నించారు. అయితే ఫీల్డ‌ర్‌ నుంచి బంతి వచ్చే క్రమంలో బౌలర్ ఎండ్ వికెట్ల ద‌గ్గ‌ర‌కు రాజ్ బ‌వా రాలేకపోయాడు..

మళ్ళీ అదే ఫెయిల్యూర్

ఐదుసార్లు ఛాంపియన్‌గా నిలిచిన ముంబై ఇండియన్స్, గత ఐదేళ్లుగా ట్రోఫీ లేక ఇబ్బంది పడుతోంది. చివరిసారిగా 2020లో టైటిల్ గెలిచిన ఈ టీమ్, ఆ తర్వాత మళ్ళీ ఆ స్థాయి ప్రదర్శన చేయలేకపోయింది. 2008 నుంచి 2012 మధ్య ఉన్న గడ్డు కాలాన్ని మళ్ళీ ఇప్పుడు చూస్తున్నట్టుగా అనిపిస్తోంది. ఐపీఎల్ 2026లో ముంబై ప్రస్థానం ఇలా గొడవలు, ఓటములతో ముగియడం అభిమానులను నిరాశకు గురిచేస్తోంది.
మైదానంలోనే మాటల యుద్ధం

క్యాచ్ మిస్ అవ్వగానే నమన్ ధీర్ సహనం కోల్పోయాడు. అంత కష్టపడి బంతిని లోపలికి విసిరితే ఎందుకు పట్టుకోలేదని తిలక్ వర్మపై కేకలు వేశాడు. తిలక్ కూడా వెనక్కి తగ్గకుండా ధీటుగా సమాధానమివ్వడంతో ఇద్దరి మధ్య వాగ్వాదం పెరిగింది. క్రునాల్ పాండ్యా వికెట్ అప్పట్లో మ్యాచ్‌కు చాలా కీలకం కాబట్టి, ఆ ఒత్తిడిలో ఇద్దరూ గొడవకు దిగారు. కాసేపటి తర్వాత సర్దుకున్నా, ఈ సీన్ చూసిన నెటిజన్లు మాత్రం ముంబై టీంలో అసలు యూనిటీ ఉందా? అని ప్రశ్నిస్తున్నారు.

ముంబైపై 4 వికెట్లు తీసిన భువీ..

ముంబైతో జరిగిన మ్యాచ్‌లో భువనేశ్వర్ కుమార్ 4 వికెట్లు తన ఖాతాలో వేసుకున్నాడు. ఈ క్రమంలో భువీ 4 ఓవర్లలో కేవలం 23 పరుగులు మాత్రమే ఇవ్వగా, ఎకానమీ 5.80గా ఉంది.

ఐపీఎల్ సీజన్‌లో అత్యధికంగా 3 వికెట్ల హాల్ సాధించిన బౌలర్లు

6 – హర్షల్ పటేల్ (2021)

6 – భువనేశ్వర్ కుమార్ (2026)

భువనేశ్వర్ కుమార్ ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్!
ఆర్‌సిబి బౌలర్లలో భువి 4/23 గణాంకాలతో అత్యుత్తమ ప్రదర్శన కనబరచడమే కాకుండా, ఆ తర్వాత ఆర్‌సిబి ఛేజింగ్‌లోని చివరి ఓవర్‌లో ఒక కీలకమైన సిక్సర్ కొట్టాడు..