భారతీయులు నిజంగా బంగారం కొనుగోళ్లను తగ్గించుకోగలరా? దేశపు అతిపెద్ద దిగుమతుల వ్యామోహంపై మోదీ గురి..!

ఒక సంవత్సరం పాటు “అనవసరమైన” బంగారు కొనుగోళ్లకు దూరంగా ఉండాలని భారతీయులకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చేసిన పిలుపు, తాత్కాలిక యుద్ధకాలపు పొదుపు విజ్ఞప్తిలా అనిపించవచ్చు. కానీ ఈ మాటల వెనుక న్యూఢిల్లీలో చాలా లోతైన ఆర్థిక ఆందోళన దాగి ఉంది. అక్కడ, దశాబ్దాలుగా దిగుమతులపై భారతదేశానికి ఉన్న ఆధారపడటం, ఆకాశాన్నంటుతున్న చమురు ధరలు, పశ్చిమ ఆసియాలోని భౌగోళిక రాజకీయ గందరగోళం మరియు దేశ విదేశీ మారక నిల్వలపై పెరుగుతున్న ఒత్తిడితో ఘర్షణ పడుతోంది.

పశ్చిమ ఆసియాలో కొనసాగుతున్న సంఘర్షణ కారణంగా తలెత్తిన ప్రపంచ సరఫరా సంక్షోభాన్ని భారతదేశం ఎదుర్కొంటున్న నేపథ్యంలో , ఆదివారం హైదరాబాద్‌లో జరిగిన ఒక ర్యాలీలో ప్రసంగిస్తూ Modi urged citizens to conserve fuel , ఇంటి నుంచి పని చేసే విధానాలను పునరుద్ధరించాలని, అనవసర విదేశీ ప్రయాణాలను మానుకోవాలని, బంగారం సహా దిగుమతి చేసుకున్న వస్తువుల కొనుగోళ్లను తగ్గించుకోవాలని మోదీ పౌరులను కోరారు.

మన దేశం బంగారం దిగుమతుల కోసం పెద్దమొత్తంలో విదేశీ మారకద్రవ్యాన్ని వినియోగిస్తోందని.. ఈ పరిస్థితి నుంచి బయటపడాలంటే ఒక సంవత్సరం కాలం బంగారం కొనకుండా తీర్మానం చేయాలని ప్రధాని మోదీ ఈ సందర్భంగా ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు. ఇంట్లో ఎన్ని కార్యక్రమాలు ఉన్నా.. ఇలాంటి కఠినమైన నిర్ణయం తీసుకుంటే దేశ అభివ్రుద్ధికి ఎంతగానో తోడ్పతుందని ఆయన ఈ సందర్భంగా పేర్కొన్నారు. అయితే ప్రధాని మోదీ ఈ వ్యాఖ్యలు చేయడం వెనక బలమైన కారణాలే ఉన్నాయి. ఎందుకంటే గడిచిన ఏడాది కాలంగా గమనిస్తే.. మన దేశంలో బంగారం ధరలు భారీగా పెరుగుతున్నాయి. ప్రపంచవ్యాప్తంగా పెరుగుతున్న ధరల కారణంగా ఈ దుస్థితి తెలెత్తుందని చెప్పాలి. దేశం అత్యంధింగా బంగారం దిగుమతి చేసుకునే దేశాల్లో మన దేశం ముందు వరుసలో ఉంది.2024-25 ఆర్థిక సంవత్సరంలో మన దేశం సుమారు 4. 93లక్షల కోట్ల రూపాయల విలువైన బంగారం దిగుమతి చేసుకుంది. 2025-26 ఆర్థిక సంవత్సరంలో ఏకంగా 6.11 లక్షల కోట్ల రూపాయల విలువైన బంగారం విదేశాల నుంచి దిగుమతి చేసుకుంది. అంటే ఏడాది కాలంలోనే మరో లక్ష కోట్ల రూపాయల అదనంగా డిమాండ్ పెరిగినట్లు మనం ఇక్కడ గమనించవచ్చు. గడిచిన రెండు ఆర్థిక సంవత్సరాల్లో గమనిస్తే.. సుమారు 11 లక్షల కోట్ల రూపాయల విలువైన విదేశీ మారక ద్రవ్యం కేవలం బంగారం దిగుమతి చేసుకునేందుకే ఖర్చు చేయాల్సి వచ్చింది. అంతర్జాతీయంగా బంగారం ధరలు పెరగడంతోపాటు గడిచిన ఏడాదితో పోల్చితే కేంద్రం మరో లక్ష కోట్ల రూపాయలు అదనంగా ఖర్చే చేయాల్సి వచ్చింది.

వాస్తవానికి ఎగుమతుల కంటే దిగుమతుల కోసం ఎక్కువగా ఖర్చు చేస్తే కరెంట్ అకౌంట్ లోటు అనేది పెరుగుతుంది. నిజానికి 2025-26సంవత్సరంలో దేశం దిగుమతి చేసుకున్న బంగారం పరిమాణం 721 టన్నులుగా ఉంది. గత ఆర్థిక సంవత్సరంతో పోల్చితే ఇది 4.76శాతం పరిమాణం తగ్గింది. అయినా కూడా పెరిగిన బంగారం ధర కారణంగా మరో లక్ష కోట్ల రూపాయలు అదనంగా విదేశీ మారకద్రవ్యాన్ని చెల్లించాల్సి వచ్చింది.. మన దేశం ఎక్కువగా స్విట్జర్లాండ్ నుంచి సుమారు 40శాతం వరకు గోల్డ్ దిగుమతి చేసుకుంటుంది. ఆ తర్వాత యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్, సౌతాఫ్రికా నుంచి పెద్దమొత్తంలో బంగారం దిగుమతి చేసుకుంటాము. బంగారం దిగుమతి చేసుకునే క్రమంలో మన దేశంలో డిమాండ్ కు అనుగుణంగా ఈ బంగారం దిగుమతి అనేది ఉంటుంది. అయితే పసిడిని దిగుమతిని చేసుకునేందుకు డాలర్లను ఖర్చు చేయాల్సిన పరిస్థితి ఉంటుంది. డిమాండ్ ఎంత ఎక్కువ పెరిగితే అంత ఎక్కువ డాలర్లను ప్రభుత్వం ఖర్చు చేసి కొనుగోలు చేయాల్సి ఉంటుంది. ఇలా చేయడం వల్ల విదేవీ మారకద్రవ్య నిల్వలు తగ్గే ప్రమాదం ఉంది. అంతేకాదు ఈ దిగుమతుల వల్ల వాణిజ్య లోటు పెరుగుతుంది. కేంద్రం తరచుగా బంగారం దిగుమతిని నియంత్రించడానికి దిగుమతి సుంకాలను పెంచుతుంది. అయితే భవిష్యత్తులో కేంద్రం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో చూడాల్సిందే.