ఇరాన్‌తో చర్చలపై మరోసారి ట్రంప్‌ వ్యాఖ్యలు నిన్న కూడా మాతో ఇరాన్‌ చర్చలు జరిపింది.. ట్రంప్..

ఇరాన్‌తో చర్చలపై మరోసారి ట్రంప్‌ వ్యాఖ్యలు
నిన్న కూడా మాతో ఇరాన్‌ చర్చలు జరిపింది..

మాతో డీల్‌ కోసం ఇరాన్‌ తహతహలాడుతోంది
ఐదురోజుల్లోపే డీల్‌ కుదిరే అవకాశం-ట్రంప్‌..

ఇరాన్‌తో చర్చలు కొనసాగుతున్న విషయం వాస్తవం
ఇరాన్‌ మీడియా తప్పుడు ప్రచారం చేస్తోంది-ట్రంప్‌
..

ఇరాన్‌తో యుద్ధంపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సంచలన ప్రకటన చేశారు. గత మూడు వారాలుగా ఇరాన్‌పై కొనసాగుతున్న భీకర దాడులకు 5 రోజుల పాటు విరామం ప్రకటిస్తున్నట్లు ఆయన వెల్లడించారు. ఇరాన్‌తో దౌత్యపరమైన చర్చల్లో పురోగతి కనిపిస్తున్న నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు వైట్ హౌస్ వర్గాలు తెలిపాయి. గత రెండు రోజులుగా అమెరికా, ఇరాన్ ప్రతినిధుల మధ్య అంతర్గతంగా నిర్మాణాత్మక చర్చలు జరుగుతున్నట్లు ట్రంప్ ధృవీకరించారు. ‘‘మేము శాంతిని కోరుకుంటున్నాం, కానీ అది శక్తివంతమైన శాంతి అయి ఉండాలి. ప్రస్తుతం ఇరాన్‌తో చర్చలు జరుగుతున్నాయి, అందుకే రాబోయే ఐదు రోజుల పాటు ఎటువంటి దాడులు చేయవద్దని మా దళాలను ఆదేశించాను’’ అని ట్రంప్ తన సోషల్ మీడియా వేదికగా తెలిపారు…ఈ 5 రోజుల గడువులోగా ఇరాన్ తన పద్ధతి మార్చుకోకపోతే.. ముఖ్యంగా స్ట్రెయిట్ ఆఫ్ హోర్ముజ్‌ను అంతర్జాతీయ నౌకల కోసం పూర్తిగా తెరవకపోతే, ఇరాన్‌లోని అతిపెద్ద విద్యుత్ కేంద్రాలను లక్ష్యంగా చేసుకుంటామని ట్రంప్ గతంలోనే హెచ్చరించారు. తాజా విరామం ఇరాన్‌కు ఒక చివరి అవకాశంగా విశ్లేషకులు భావిస్తున్నారు..