ఇరాన్ పై మరో భీకర దాడికి అమెరికా సిద్ధం …!

ఇరాన్ పై మరో భీకర దాడికి అమెరికా సిద్ధం అయింది. అమెరికా నుంచి స్టెల్త్ బి – 1B లాన్సర్ బాంబర్ విమానాలు బయలుదేరాయి. ఇవి ఇప్పుడు మార్గ మధ్యంలో లండన్ గ్లౌసెస్టర్ షైర్ ఎయిర్ బేస్ లో నిలిపారు. ఇరాన్ పై దాడికి తమ ఎయిర్ బేస్ వాడుకునేందుకు లండన్ ప్రధాన మంత్రి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. B -2 స్టెల్త్ బాంబర్ విమానాలు కూడా మరో 24 గంటల్లో బయలు దేరుతాయని చెబుతున్నారు. 30 వేల పౌండ్ల బరువైన బాంబులు వేయగలవు. బంకర్లు, అణు స్థావరాలను సమూలంగా నాశనం చేయగలవు. ఒక నిమిషంలో శక్తివంతమైన 24 క్షిపణులను సంధించగలవు.. రాడార్ లకు కూడా చిక్కకుండా 50 వేల అడుగుల ఎత్తు నుంచి దాడులు చేయగలవు..