బహ్రెయిన్‌లో అమెరికా సైనిక స్థావరంపై ఇరాన్‌ దాడి..

బహ్రెయిన్‌లో అమెరికా సైనిక స్థావరంపై ఇరాన్‌ దాడి..

ఒకేసారి 8 దేశాలపై మిస్సైళ్లు ప్రయోగించిన ఇరాన్‌
ఇజ్రాయెల్‌, బహ్రెయిన్‌, కువైట్‌, సౌదీతో పాటు..
అబుదాబి, ఖతార్‌, జోర్డాన్‌, యూఏఈపై ఇరాన్‌ దాడులు..

ఇరాన్‌పై చేసిన దాడుల‌కు అమెరికా ర‌క్ష‌ణ శాఖ పేరు పెట్టింది. ఆప‌రేష‌న్ ఎపిక్ ఫ్యూరీ(Operation Epic Fury) చేప‌ట్టిన‌ట్లు పేర్కొన్న‌ది. ర‌క్ష‌ణ‌శాఖ‌కు చెందిన డిపార్ట్‌మెంట్ ఆఫ్ వార్ త‌న ఎక్స్ అకౌంట్‌లో ఈ పోస్టు చేసింది. ఆప‌రేష‌న్ ఎపిక్ ఫ్యూరీ అని ట్యాగ్‌లైన్ రాసి అమెరికా జెండా ఎమోజీని పోస్టు చేసింది. ఇజ్రాయెల్‌తో క‌లిసి ఈ ఆప‌రేష‌న్ చేప‌ట్టిన‌ట్లు అమెరికా పేర్కొన్న‌ది. శ‌నివారం ఉద‌యం అక‌స్మాత్తుగా ఇరాన్‌పై ఇజ్రాయెల్ క్షిప‌ణి దాడ‌లు చేసింది. సుప్రీం నేత ఖ‌మేనీ నివాసం, ఆఫీసుపై క్షిప‌ణి అటాక్ జ‌రిగింది. అయితే గ‌త ఏడాది ఇరాన్‌లోని అణ్వాయుధ కేంద్రాల‌పై కూడా అమెరికా దాడి చేసిన విష‌యం తెలిసిందే. ఆ దాడుల‌కు ఆప‌రేష‌న్ మిడ్‌నైట్ హ‌మ్మ‌ర్ అని పేరు పెట్టిన విష‌యం తెలిసిందే..