ఇజ్రాయెల్ ఆర్థిక వ్యవస్థకు వెన్నెముక వంటి హైఫా నగరంలోని అతిపెద్ద చమురు శుద్ధి కేంద్రం (బజాన్ రిఫైనరీ)పై ఇరాన్ క్షిపణులతో భారీ దాడికి తెగబడింది. ఈ దాడి కారణంగా రిఫైనరీలో భారీ ఎత్తున మంటలు చెలరేగగా, ఆకాశమంతా నల్లటి పొగ కమ్ముకుంది. బజాన్ రిఫైనరీ లక్ష్యంగా దాడి జరగడం ఇది రెండోసారి కావడంతో ఇజ్రాయెల్ రక్షణ వ్యవస్థలపై చర్చ మొదలైంది. ఈ దాడి వల్ల చమురు సరఫరాకు ఆటంకం ఏర్పడటమే కాకుండా, ఇజ్రాయెల్ ఇంధన రంగంపై తీవ్ర ప్రభావం పడే అవకాశం ఉంది. దీనికి ప్రతిచర్యగా కువైట్లోని ఉప్పునీటి శుద్ధి కర్మాగారంపై ఇజ్రాయెల్ దాడి చేసిందని ఇరాన్ ఆరోపిస్తోంది, ఇది ఇరు దేశాల మధ్య ఘర్షణ ఏ స్థాయికి చేరిందో సూచిస్తోంది…
Sign in
Sign in
Recover your password.
A password will be e-mailed to you.