పాకిస్థాన్ గాలి తీసిన ఇరాన్..పాకిస్థాన్ మధ్యవర్తి మాకు అవసరం లేదు…!

తమకు తెలియకుండానే పాక్ ఆ చర్చల వేదికలను ఏర్పాటు చేసుకుందని ఇరాన్ (Iran) విదేశాంగ శాఖ స్పష్టం చేసింది. అయితే, పాకిస్థాన్ ఏర్పాటు చేసిన దౌత్య వేదికలు వారి సొంత నిర్ణయమని స్పష్టం చేశారు. ఆ చర్చల్లో ఇరాన్ ఎప్పుడూ భాగస్వామి కాలేదని.. అసలు తాము అందులో పాల్గొననే లేదని ఇరాన్ విదేశాంగ మంత్రిత్వ శాఖ ప్రతినిధి ఓ ప్రకటన విడుదల చేశారు.

కాగా, ఇరాన్, అమెరికా (America) మధ్య పెరుగుతున్న ఘర్షణలను నివారించేందుకు పాక్ ఓ మధ్యవర్తిగా వ్యవహరించాలని భావించింది. అయితే దీనిపై ఇరాన్ నుంచి ఎలాంటి సానుకూలత రాకపోవడంతో ఆ ప్రయత్నాలు నీరుగారాయి. అమెరికాతో తాము ఎటువంటి ప్రత్యక్ష చర్చలు జరపడం లేదని ఇరాన్ వెల్లడించింది. మధ్యవర్తుల ద్వారా అమెరికా పంపిస్తున్న ప్రతిపాదనలు అర్థం లేని విధంగా ఉన్నాయని ఇరాన్ ఆరోపించింది….

ఇరాన్- అమెరికా యుద్ధంపై పాకిస్థాన్ సంధి చర్చలకు సిద్ధం అవుతున్నప్పటికీ అందులో ఇరాన్ ప్రమేయం ఏమీ లేదని కాన్సులేట్ స్పష్టం చేసింది. పాకిస్థాన్ తీసుకున్న నిర్ణయం సరైనదేనని కానీ ప్రస్తుత పరిస్థితులకు గల కారణం ఎవరో గుర్తుంచుకోవాలని పరోక్షంగా అమెరికాపై కీలక వ్యాఖ్యలు చేసింది ముంబైలోని ఇరాన్ కాన్సులేట్. ఇరాన్- అమెరికా మధ్య ఇప్పటివరకూ జరిపినవి అన్నీ మధ్యవర్తుల మధ్యే జరిగాయని ఇరాన్ ప్రత్యక్షంగా ఈ చర్చల్లో పాల్గొనలేదని తెలిపింది..ఇక ఇజ్రాయెల్‌ లోని హైఫా నగరంలో ఉన్న ఆయిర్ రిఫైనరీలపై ఇరాన్ మరోసారి దాడులకు పాల్పడింది. దాంతో అక్కడ ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. ఇజ్రాయెల్ ఫైర్‌ సిబ్బంది కొన్ని గంటలపాటు శ్రమించి మంటలు అదుపు చేసింది. మరోవైపు అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఇరాన్ కు ఫైనల్ వార్నింగ్ ఇచ్చారు. ఇరాన్.. చర్చలకు రాకపోతే, హార్మూజ్ జలసంధిని తెరవకపోతే ఖార్గ్ ఐలాండ్స్ తో పాటు ఎనర్జీ కేంద్రాలు, ఆయిర్ రిఫైనరీస్ పై దాడులు చేసి వాటిని పేల్చేస్తామని ట్రంప్ సంచలన వార్నింగ్ ఇచ్చారు. ఈ మేరకు ట్రంప్ ట్రూత్ సోషల్ వేదికగా ప్రకటించారు..