బహ్రెయిన్‌పై డ్రోన్లతో దాడి చేసిన ఇరాన్. అమెజాన్ క్లౌడ్ కంప్యూటింగ్ సెంటర్ ధ్వంసం అమెరికాకు చెందిన 18 టెక్ కంపెనీలపై దాడులు…!
బహ్రెయిన్‌పై డ్రోన్లతో దాడి చేసిన ఇరాన్.
అమెజాన్ క్లౌడ్ కంప్యూటింగ్ సెంటర్ ధ్వంసం
అమెరికాకు చెందిన 18 టెక్ కంపెనీలపై..
అసలు ఏం జరిగింది?
నివేదికల ప్రకారం, బహ్రెయిన్‌లోని అమెజాన్ కేంద్రాన్ని ఇరాన్ లక్ష్యంగా చేసుకుంది. ఈ డ్రోన్ దాడి కారణంగా డేటా సెంటర్‌లో భారీ అగ్నిప్రమాదం జరగడంతో పాటు విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడింది. కంపెనీకి చెందిన ఒక యూనిట్‌లో మంటలు చెలరేగాయని, పౌర రక్షణ దళం మంటలను ఆర్పేందుకు పనిచేస్తోందని బహ్రెయిన్ అంతర్గత వ్యవహారాల మంత్రిత్వ శాఖ ‘X’ అనే సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్‌లో తెలియజేసింది.
దాడికి ప్రధాన కారణం ఏమిటి?
ఇరాన్ మీడియా ప్రకారం, బహ్రెయిన్‌లోని ఈ డేటా సెంటర్ అమెరికా సైనిక మరియు గూఢచార కార్యకలాపాలకు సాంకేతిక మద్దతును అందిస్తోంది. ఈ కారణంగానే ఇరాన్ ఈ కేంద్రాన్ని లక్ష్యంగా చేసుకుంది. గమనించదగ్గ విషయం ఏమిటంటే, మెటా, గూగుల్, ఆపిల్ మరియు మైక్రోసాఫ్ట్ వంటి 18 ప్రధాన అమెరికన్ కంపెనీల డేటాబేస్‌లను లక్ష్యంగా చేసుకుంటామని ఇరాన్ గతంలోనే బెదిరించింది..
దాడులు చేస్తామని నిన్న ప్రకటించిన IRGC.
మిడిల్ ఈస్ట్‌లో అమెరికన్ కంపెనీలను లక్ష్యంగా చేసుకుంటామని హెచ్చరించిన కొన్న గంటల్లోనే ఇరాన్ అనుకున్నంత పని చేసింది. బహ్రెయిన్‌లోని బటెల్కో (Batelco) ప్రధాన కార్యాలయంపై ఇరాన్ క్షిపణి దాడి చేసింది. బహ్రెయిన్‌లో అమెజాన్ వెబ్ సర్వీసెస్ నిర్వహిస్తున్న అతిపెద్ద టెలికమ్యూనికేషన్ సంస్థ లో బటెల్కో ఒకటి కావడం చర్చనీయాంశంగా మారింది…
ఇరాన్ క్షిపణి దాడుల వల్ల బహ్రెయిన్‌లోని కీలకమైన టెలికమ్యూనికేషన్ హబ్‌లో మంటలు చెలరేగి భారీ నష్టం వాటిల్లినట్లు తెలుస్తోంది. దాడి జరిగిన ప్రాంతం నుంచి దట్టమైన పొగలు కమ్ముకుంటున్న దృశ్యాలు, వీడియోలు ఆన్‌లైన్‌లో చక్కర్లు కొడుతున్నాయి. బటెల్కో బహ్రెయిన్ జాతీయ మౌలిక సదుపాయాలలో అత్యంత కీలకమైన భాగం. ఈ టెలికాం హబ్‌పై జరిగిన దాడి దేశ భద్రత పరంగా అత్యంత ప్రాధాన్యతను సంతరించుకుంది.
కొనసాగుతున్న అమెరికా-ఇరాన్ వివాదంలో ఉద్రిక్తతలు కొనసాగుతున్న క్రమంలో ఈ దాడి జరిగింది. పశ్చిమాసియాలో అమెరికాతో సంబంధం ఉన్న టెక్ కంపెనీలను లక్ష్యంగా చేసుకుంటామని ఇరాన్ ఇటీవల పదేపదే హెచ్చరించింది. అమెరికా, ఇజ్రాయెల్ తో యుద్దంలో భాగంగా ఇప్పటికే బహ్రెయిన్, సౌదీ అరేబియా ,యూఏఈ తో సహా పలు గల్ఫ్ దేశాలపై ఇరాన్ క్షిపణి, డ్రోన్ దాడులకు పాల్పడిన విషయం తెలిసిందే