ప్రపంచ ఇంధన సరఫరా పై ఇరాన్ యుద్ధం ప్రకటించింది. దీని వలన ప్రమాదం లో పడిన దేశాలు ఇవే…

ప్రపంచ ఇంధన సరఫరా పై ఇరాన్ యుద్ధం ప్రకటించింది. దీని వలన ప్రమాదం లో పడిన దేశాలు ఇవే.

రాస్ లఫాన్ (Ras Laffan). తగలబడుతోంది. చమురు ధర బ్యారెల్‌కు $112 కి చేరింది. హార్ముజ్ జలసంధి మూసివేయ బడింది. క్రింద పేర్కొన్న ప్రతి దేశం ఇప్పుడు తీవ్ర ఇబ్బందుల్లో పడింది:

ఖతార్:- రాస్ లఫాన్ LNG కాంప్లెక్స్‌ పై దాడి జరిగింది. “భారీ నష్టం” వాటిల్లింది. ప్రపంచంలోని 20% LNG సరఫరా నిలిచిపోయింది. మార్చి 2 నుండి గ్యాస్ ఎగుమతులు ఆగిపోయాయి. 24 గంటల్లో ఇరాన్ దౌత్యవేత్తలను బహిష్కరించారు.

ఇరాన్:- ఖతార్‌ పై 5 బాలిస్టిక్ క్షిపణులను ప్రయోగించింది. గతంలో 60 కి పైగా క్షిపణి దాడులు చేసింది. గల్ఫ్ అంతటా 8 కంటే ఎక్కువ ఇంధన కేంద్రాలను లక్ష్యంగా చేసుకుంది. ఇప్పుడు తన మాజీ మధ్యవర్తితోనే యుద్ధానికి దిగింది.

అమెరికా:- ఖతార్‌ లోని అల్ ఉదైద్ ఎయిర్ బేస్‌పై 2 ఇరానియన్ క్షిపణులు పడ్డాయి. అక్కడ 10,000 మందికి పైగా సైనికులు ఉన్నారు. అత్యవసర యుద్ధ నిధుల కోసం పెంటగాన్ $200 బిలియన్లను కోరుతోంది.

సౌదీ అరేబియా:- సామ్‌ రెఫ్ రిఫైనరీ మరియు జుబైల్ పెట్రోకెమికల్ కాంప్లెక్స్‌లను లక్ష్యంగా చేసుకున్నారు. రియాద్ మీదుగా వచ్చిన బాలిస్టిక్ క్షిపణులను అడ్డుకున్నారు. రాజధాని లో పేలుడు శబ్దాలు వినిపించాయి.

*యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (UAE)*:- హబ్షాన్ గ్యాస్ ప్లాంట్ మూసివేయబడింది. క్షిపణి దాడుల నేపథ్యంలో కార్యకలాపాలు నిలిపివేశారు. అల్ దఫ్రా ఎయిర్ బేస్‌ను కూడా గతంలో లక్ష్యంగా చేసుకున్నారు.

*యునైటెడ్ కింగ్‌డమ్*:- బ్రిటన్ తన LNG అవసరాలలో 12 – 14% ఖతార్ నుండే పొందుతుంది. వీరికి ఇతర ప్రత్యామ్నాయం లేదు. విద్యుత్ బిల్లులు భారీగా పెరగనున్నాయి.

*జర్మనీ*:- యూరోప్ యొక్క అతిపెద్ద ఆర్థిక వ్యవస్థ. ఇప్పటికీ LNG దిగుమతులపైనే ఆధారపడి ఉంది. హార్ముజ్ జలసంధి మూసివేత వల్ల సరఫరా గొలుసు నేరుగా దెబ్బతింటుంది.

*జపాన్*:- తన ఇంధన అవసరాల కోసం 97% దిగుమతులపైనే ఆధారపడుతుంది. ఖతార్ వీరికి ప్రధాన LNG సరఫరాదారు. వీరికి వేరే ఇతర ఇంధన వనరులు లేవు.

*దక్షిణ కొరియా*:- 85% ఇంధనం దిగుమతి చేసుకుంటుంది. ఖతార్‌కు ప్రధాన కస్టమర్. దేశంలోని ప్రతి ఫ్యాక్టరీ ఇప్పుడు ప్రమాదంలో పడింది.

*భారతదేశం*:- గల్ఫ్ నుండి చమురు మరియు LNG ని దిగుమతి చేసుకునే ప్రధాన దేశం. గల్ఫ్ దేశాలలో ఉన్న 80 లక్షల మంది భారతీయ కార్మికులు ఇప్పుడు యుద్ధ ప్రాంతం లో చిక్కుకున్నారు.

*చైనా*:- చైనా చమురు దిగుమతులలో 40% పైగా గల్ఫ్ నుండే అందుతుంది. హార్ముజ్ జలసంధి మూసివేత చైనా ఉత్పాదక రంగంపై నేరుగా దెబ్బకొడుతుంది.

*బహ్రెయిన్*:- ఈరోజు ఇరాన్ క్షిపణి దాడులకు గురైంది. అమెరికా 5వ నౌకాదళ ప్రధాన కార్యాలయం ఇక్కడే ఉంది.

*కువైట్*:- ఇరాన్ ఇక్కడ అలి అల్ సలేమ్ ఎయిర్ బేస్‌ను లక్ష్యంగా చేసుకుంది. క్షిపణి శకలాల వల్ల పౌరులు గాయపడినట్లు నివేదికలు అందుతున్నాయి.

ప్రపంచవ్యాప్తంగా ఉన్న సెమీకండక్టర్ తయారీ కేంద్రాలు, ప్రపంచానికి కావాల్సిన 57% హీలియంను ఖతార్ సరఫరా చేస్తుంది. హీలియం లేకపోతే చిప్ తయారీ ఉండదు. చిప్స్ లేకపోతే ఐఫోన్‌లు, కార్లు, కంప్యూటర్లు ఏవీ ఉండవు. ఇది కేవలం యుద్ధం కాదు. ప్రపంచ ఆర్థిక వ్యవస్థపై జరుగుతున్న వ్యవస్థీకృత దాడి.