ఇరాన్‌-ఇజ్రాయెల్‌ మధ్య యుద్ధం ముగిసింది..!

ఇరాన్‌-ఇజ్రాయెల్‌ మధ్య 11రోజుల యుద్ధం ముగిసింది. మంగళవారం తెల్లవారుజాము నుంచి యుద్ధవిరమణకు ఇరాన్‌-ఇజ్రాయెల్‌ అంగీకరించినట్లు అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌ ప్రకటించగా ఇరాన్‌ ధ్రువీకరించింది. ఈ మేరకు ఇరాన్‌ అధికారిక ఛానల్‌ ప్రకటించింది. మరోవైపు ఇజ్రాయెల్ సైతం ట్రంప్ కాల్పుల విరమణ ప్రకటనను ఆమోదించింది. ఈ మేరకు ఇజ్రాయెల్ ప్రధానమంత్రి బెంజిమన్ నెతాన్యాహూ ప్రకటించారు.

ఇరాన్ కాలమానం ప్రకారం ఉదయం ఏడున్నర గంటలకు యుద్ధ విరమణ అమల్లోకి వచ్చినట్లు అధికారిక ఛానల్ వెల్లడించింది. గ్రాఫిక్స్‌తో కథనం ప్రసారం చేసింది. యుద్ధ విరమణపై ఇరాన్‌ ప్రకటన తర్వాత ఇజ్రాయెల్‌ కూడా ధ్రువీకరించింది. ఆ తర్వాత అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌ కూడా కాల్పుల విరమణ ఒప్పందం అమల్లోకి వచ్చిందని సామాజిక మాధ్యమం ట్రూత్‌ ద్వారా ప్రకటించారు. దయచేసి దాన్ని ఎవరూ ఉల్లంఘించవద్దని సూచించారు..