ఐర్లాండ్ లో మితిమీరిన జాతి అహంకారం..ఆరేళ్ల బాలిక మీద కొంత మంది అబ్బాయిలు సైకిల్ తో పాప ప్రైవేట్ పార్ట్ మీద దాడి ..!

ఐర్లాండ్ లో చిన్న పిల్లల దగ్గర నుంచీ పెద్ద వాళ్ళ వరకూ జాత్యాహంకారం మితిమీరిపోతోంది. గత కొన్ని రోజులుగా అక్కడ వరుసపెట్టి భారతీయులపై దాడులు చేస్తున్నారు..తమ దేశం నుంచి వెళ్ళిపోవాలి అంటూ తిట్టడమే కాక.. ఇష్టం వచ్చినట్లు అటాక్ చేస్తున్నారు. చిన్న పిల్లలు సైతం ఇలాంటి పనులు చేయడం ఆశ్చర్యం కలిగిస్తోంది. దీంతో ఐర్లాండ్ లో భారతీయులు ఉండాలంటే భయపడే స్థితి వస్తోంది.
https://x.com/IrishMirror/status/1953065770013081790?t=Yn3O8Qa9cp8wKyIfrO1uTg&s=19
ముఖం మీద పిడిగుద్దులు..సైకిల్ తో దాడి..

రీసెంట్ గా ఆగస్టు 4న జరిగిన ఓ సంఘటనపై ఐర్లాండ్ లోని భారతీయులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. వాటర్ ఫోర్ట్ అనే ప్రదేశంలో భారత సంతతికి చెందిన ఆరేళ్ల బాలిక మీద కొంత మంది అబ్బాయిలు గో బ్యాక్ టూ ఇండియా అంటూ దాడి చేశారు. సైకిల్ తో పాప ప్రైవేట్ పార్ట్ మీద కొట్టారు. ముఖం మీద పిడిగుద్దులు కురిపించారు. దాంతో పాటూ నోటికి వచ్చినట్టు తిట్టారని తెలుస్తోంది. ఎఫ్ పదం వాడడంతో పాటూ…డర్టీ ఇండియా, ఇండియాకు తిరిగి వెళ్ళిపో అంటూ మాట్లాడారు. ఇదంతా చేసిన కుర్రాళ్ళ వయసు కూడా అంత ఎక్కువ ఏమీ కాదు. వారందరూ 12 నుంచి 14 ఏళ్ళలోపు వారే ఉంటారని బాలిక తల్లి చెబుతున్నారు. తన కళ్ళ ఎదురుగానే పాప మీద దాడి చేశారని ఆమె చెబుతున్నారు…

https://x.com/RT_India_news/status/1952759075407536298?t=2kpq8-XU1i8Je5VZvZm3Rg&s=19