ఇజ్రాయెల్-ఇరాన్‌ల మధ్య యుద్ధంతో పశ్చిమాసియా మళ్లీ భగ్గుమంది. టెహ్రాన్‌పై ఇజ్రాయెల్ శుక్రవారం భీకరస్థాయిలో విరుచుకుపడగా…ఇరాన్ సైతం అంతేస్థాయిలో ప్రతిదాడులు చేసింది. ఈ ఉద్రిక్తతల వేళ ఇజ్రాయెల్ (Israel) డిఫెన్స్ ఫోర్సెస్ (ఐడీఎఫ్) చేసిన ఓ పోస్ట్ భారతీయులను ఆగ్రహానికి గురిచేసింది. దీంతో ఐడీఎఫ్ (IDF) క్షమాపణలు చెప్పింది.
టెహ్రాన్‌పై వైమానిక దాడులకు దిగిన ఐడీఎఫ్.. శుక్రవారం రాత్రి తమ ‘ఎక్స్’ ఖాతాలో ఓ పోస్ట్ చేసింది. ”ఇరాన్ (Iran)కు ఇజ్రాయెల్ అంతిమ లక్ష్యం కాదు. ఇది ప్రారంభం మాత్రమే. ఆ దేశం ప్రపంచం మొత్తానికి పెనుముప్పే. ఇప్పుడు మాకు మరో అవకాశం లేదు” అని ఐడీఎఫ్ అందులో రాసుకొచ్చింది. దీన్ని ప్రతిబింబించేలా ప్రపంచ పటానికి సంబంధించిన ఓ ఫొటోను కూడా జత చేసింది. అయితే, అందులో భారత మ్యాప్‌ను తప్పుగా చూపించడం వివాదాస్పదమైంది.
ఆ ఫొటోలో జమ్మూకశ్మీర్ (Jammu and Kashmir)ను పాకిస్థాన్‌లోని భూభాగంగా చూపిస్తున్నట్లు ఉండటంతో భారత నెటిజన్లు తీవ్రంగా మండిపడ్డారు. దాన్ని వెంటనే డిలీట్ చేయాలని డిమాండ్ చేశారు. ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహును ట్యాగ్ చేస్తూ పోస్టులు పెట్టారు. దీంతో ఐడీఎఫ్ స్పందించింది. ”అది కేవలం ఇరాన్ ముప్పు పొంచి ఉన్న ప్రాంతాలను ఉదహరించడం కోసం చేసిన పోస్ట్ మాత్రమే. అందులో ఉపయోగించిన మ్యాప్ ఫొటో.. దేశాల సరిహద్దులను కచ్చితంగా చూపించడంలో విఫలమైంది. ఈ తప్పిదానికి మేం క్షమాపణలు తెలియజేస్తున్నాం” అని మరో పోస్ట్ చేసింది.
ఇరాన్-ఇజ్రాయెల్ మధ్య ఉద్రిక్తతలు మళ్లీ తీవ్ర స్థాయికి చేరిన సంగతి తెలిసిందే. తొలుత ఇరాన్ అణు, సైనిక స్థావరాలు, సైనిక ఉన్నతాధికారులు లక్ష్యంగా వందల క్షిపణులు, డ్రోన్లతో ఇజ్రాయెల్ దాడి చేసింది. ఈ భీకర పోరులో కీలకమైన మిలిటరీ నాయకత్వాన్ని, అణుశాస్త్రవేత్తలను టెహ్రాన్ కోల్పోయింది. ఆ దేశ అణు కేంద్రాల్లోని మౌలిక వసతులు తీవ్రంగా దెబ్బతిన్నట్లు తెలుస్తోంది. దీంతో ప్రతీకార దాడులకు దిగిన ఇరాన్ తొలుత భారీ సంఖ్యలో డ్రోన్లను ఇజ్రాయెల్ పైకి పంపింది. ఆ తర్వాత శుక్రవారం రాత్రి వందల సంఖ్యలో క్షిపణులను ప్రయోగించింది. దీంతో టెలి అవీవ్, జెరూసలేంలలో పలుచోట్ల పేలుళ్లు జరిగాయి. ప్రస్తుతం ఇరుదేశాల మధ్య దాడులు కొనసాగుతున్నాయి..
ఎవరూ నిజంగా మీ స్నేహితులు కారు అంటూ కామెంట్స్ చేశారు. నెటిజన్ల ఆగ్రహంతో ఐడీఎఫ్ రియాక్ట్ అయింది. ఇది కేవలం ఇరాన్ ముప్పు పొంచి ఉన్న ప్రాంతాలను ఉదాహరించడం కోసం చేసిన పోస్టు మాత్రమేనని ఇందులో ఉపయోగించిన మ్యాప్ ఫోటో దేశాల సరిహద్దులను కచ్చితంగా చూపించడంలో విఫలమైందని పేర్కొంది. ఈ తప్పిదానికి క్షమాపణలు కోరుతున్నాం అని మరో పోస్టు చేసింది…