యుద్దాల వెనక అమెరికా.. ఆసియా ఖండంలో ప్రశాంతతను దెబ్బతీస్తుందా..!?

దూడని చేయమని బర్రెను తనం అనే విధంగా తయారైంది అమెరికా పరిస్థితి.. ఆసియా ఖండంలో అన్ని దేశాల మధ్య వివాదాల సృష్టిస్తున్నట్టుగా ఆరోపణలు… మొదట ఒకరికి మద్దతు తర్వాత మరొకరికి వెనక నుండి మద్దతు…

పాకిస్తాన్ ఇండియా విషయంలో కూడా అదే జరిగింది…
ఇండియాకి బంగ్లాదేశ్ దూరం చేసే పనిలో కూడా అమెరికా ఉద్దేశం కనిపిస్తుంది..
ప్రస్తుతం భారతదేశానికి అనుకూలంగా ఉన్న రెండు మిత్ర దేశాల మధ్య కూడా కయాటం పెట్టి తన చేతి సంబంధం లేనట్టుగా వ్యవహరిస్తుంది…

ప్రస్తుతం ఇరాన్, ఇజ్రాయిల్ మధ్య సంబంధాలు కూడా దెబ్బతినేలా వ్యవహరించారు..?

ఒకరితో మైత్రి కొనసాగిస్తూ మరొకరికి ఆయుధాలు అందిస్తున్నట్లుగా ఆరోపణలు ఎక్కువగా వస్తున్నాయి.. తగినట్లుగానే ట్రంప్ . ఆదేశాలు కూడా ఉన్నాయి..

రష్యా, ఉక్రెయిన్ మధ్య చిచ్చుపెట్టింది.. మధ్య ప్రాచ్యంలో ఆరని మంటలకు అమెరికానే కారణం. చేసిందేమీ లేకపోయినా భారత్, పాకిస్తాన్ మధ్య ఉద్రిక్తల్ని ఆపానని మాత్రం ట్రంప్ ప్రచారం చేసుకుంటున్నారు.

మధ్యప్రాచ్యంలో యుద్ధమేఘాలు అమెరికా పాపం

ఇరాన్ పై ఇజ్రాయెల్ దాడులు చేసింది. ఇరాన్ అణ్వాయుధాలు సమకూర్చుకుంటోందని అందుకే దాడులు చేశామని ఇజ్రాయెల్ వాదిస్తోంది. ఆర్మీ చీఫ్‌ను.. అణుశాస్త్రవేత్తల్ని చంపేసింది. ఇలా ఇజ్రాయెల్ దాడులు చేయడానికి అమెరికా మద్దతే కీలకం. ఇరాన్ చాలా కాలంగా అణుకార్యక్రమాలు నిర్వహిస్తోంది. అయితే ఇరాన్ ను నియంత్రించాలని .. తమతో అణుఒప్పందం చేసుకోవాలని అమెరికా ప్రయత్నిస్తోంది. ఆ ఒప్పందానికి ఇరాన్ అంత సానుకూలంగా లేదు. దాంతో అమెరికా ఇజ్రాయెల్ ను ప్రయోగించింది. ఇప్పుడు ఆ రెండు దేశాల మధ్య వైరం ఎవరూ ఊహించని యుద్ధానికి దారి తీసే ప్రమాదం కనిపిస్తోంది.

రష్యా, ఉక్రెయిన్ మధ్య చిచ్చు పెట్టింది – మంటల్ని ఎగదోస్తోంది అమెరికానే

రష్యా, ఉక్రెయిన్ మధ్య చిచ్చు పెట్టింది నాటో దేశాలు. ఆ రెండు దేశాల మధ్య ఉద్రిక్తతలు ఎప్పుడూ ఉన్నాయి. అయితే అవి దాడుల వరకూ వెళ్లడానికి కారణం అమెరికా. ఉక్రెయిన్ కు సైనిక, ఆర్థిక సాయం చేసి రష్యాలపై దాడులకు పులికొల్పింది. రష్యా దాడి చేస్తే మేము అండగా ఉంటామని నాటో దేశాలు ఉక్రెయిన్ కు భరోసా ఇచ్చాయి. చివరికి మధ్యలో వదిలేశాయి. ఇప్పటికీ ఆయుధాల సాయం చేసి.. రష్యాలపై దాడులకు సాయం చేస్తోంది. రష్యా ప్రతి దాడులతో ఉక్రెయిన్ ఇంకా ఇంకా ధ్వంసం అవుతోంది. ఈ పాపం ఖచ్చితంగా అమెరికాదే.

భారత్, పాక్ ఉద్రిక్తతలు నియంత్రించామని గొప్పలు

భారత్ , పాకిస్తాన్ మధ్య పరిస్థితి ఉద్రిక్తంగా మారినప్పుడు.. అది మాకు సంబంధం లేని అని ఉపాధ్యక్షుడు అంతర్జాతీయ మీడియాకు నేరుగానే చెప్పారు. తర్వాత రెండు దేశాలు కాల్పుల విరమణకు నిర్ణయం తీసుకుంటే.. అది తన విజయం అని ట్రంప్ ప్రచారం చేసుకుంటున్నారు. కానీ అమెరికా పాకిస్తాన్ కు పరోక్ష మద్దతు ఇచ్చింది. తమ సైనిక పరేడ్‌కు .. పాక్ ఆర్మీ చీఫ్ ను ఆహ్వానించింది. అమెరికా అగ్రరాజ్యం.. ఆ దేశం ఇలా కుట్రపూరితంగా వ్యవహరిస్తే ప్రపంచం అతలాకుతలం అవుతుంది. ఇప్పుడదే జరుగుతోంది…

ఆసియా ఖండంలో కొత్త ఇచ్చినారు నీకు సృష్టించడంలో ట్రంప్ ప్రభుత్వం ముందుకు… తప్పు నిర్ణయాలతో ఆశ ఖండంలో ఉన్న మన దేశాల మధ్య సంబంధాలు యుద్దాల వరకు వస్తున్నాయి…. అగ్రరాజ్యం గా ఉండాలని ఆలోచనతో అందరిని అణిచివేయాలనే పద్ధతిని అవలంబిస్తుందంటూ పలువురు సోషల్ మీడియాలో అమెరికా పై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు..

ప్రపంచవ్యాప్తంగా కూడా అమెరికా ఒకరి మధ్యలో ఒకరికి వైరం సృష్టిస్తూ ఆయా దేశాలకి వారి అవసరమెంటో తెలిసేలా చేస్తుందంటూ పలువురు విశ్లేషకులు కూడా అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు…