మధ్యలో చర్చలు, శాంతి ఒప్పందం పేరుతో కొంతకాలం హంగామా చేసినా, ఇజ్రాయెల్ ఒత్తిడితో అమెరికా ఈ యుద్దాన్ని ఇంకా కొనసాగిస్తోంది. రెండు నెలల్లో అమెరికాలో మధ్యంతర ఎన్నికలు ఎదుర్కోబోతున్న ట్రంప్ సర్కార్ కు ఇరాన్ యుద్దం తలనొప్పిగా తయారైంది. దీంతో కొంతకాలం యుద్దాన్ని ఆపి, ఇరాన్ ను ఆర్ధిక దిగ్బంధం చేసే దిశగా ట్రంప్ ఎత్తులు వేస్తున్నారు. దీంతో ఇదే అదనుగా ఇరాన్ రూటు మారుస్తోంది.
ఇజ్రాయెల్ పై ఇరాన్ మెరుపుదాడి ?. (Iran)
ఇన్నాళ్లూ అమెరికా అండతో తమపై రెచ్చిపోయిన ఇజ్రాయెల్ పై ప్రతీకారం తీర్చుకునేందుకు ఇరాన్ భారీ వ్యూహరచన చేస్తోంది. ఇందులో భాగంగా ఒకేసారి తమకు అండగా ఉంటున్న మిలిటెంట్ గ్రూపులు హమాస్, హిజ్బొల్లా, హౌతీలతో కలుపుకుని ఇజ్రాయెల్ పై మెరుపుదాడి చేసేందుకు ఇరాన్ ప్లాన్ చేస్తోంది. 2023 అక్టోబర్ 7న హమాస్ జరిపిన మెరుపు దాడి తరహాలోనే, ఈసారి అంతకంటే ప్రమాదకరమైన ఉమ్మడి వ్యూహాన్ని అమలు చేయాలని ఇరాన్ యోచిస్తోంది.ఇజ్రాయెల్ ను అన్ని వైపుల నుంచి ఏకకాలంలో ముట్టడించి, ఆత్మరక్షణలో పడేయడమే ఈ సరికొత్త ఆపరేషన్ యొక్క ప్రధాన లక్ష్యంగా కనిపిస్తోంది.