పాకిస్థాన్ పరిపాలనలో ఉన్న కాశ్మీర్ (PoK)లో కొనసాగుతున్న ఆందోళనలు మరింత ఉధృతమవుతున్నాయి. సెప్టెంబర్ 26న పూంచ్ జిల్లాలోని మంధోల్ ప్రాంతంలో జాయింట్ అవామీ యాక్షన్ కమిటీ (JAAC) ఆధ్వర్యంలో భారీ ధర్నా నిర్వహించింది…ఈ ఆందోళనలో వేలాది మంది పాల్గొన్నట్లు సమాచారం. JAAC గత కొంతకాలంగా ఆర్థిక, రాజకీయ, పరిపాలనా హక్కులతో పాటు ప్రాంతీయ సమస్యలపై నిరసనలు కొనసాగిస్తోంది.
తాజా ధర్నాలో JAAC నాయకుడు సర్దార్ అమన్ ఖాన్ కీలక వ్యాఖ్యలు చేశారు. పాక్ ఆధీనంలోని కాశ్మీర్, భారత జమ్మూ కాశ్మీర్ మధ్య ఉన్న నియంత్రణ రేఖ (LoC)ను తొలగించాలని, పూంచ్-మెంధర్ మార్గాలను తిరిగి తెరవాలని డిమాండ్ చేశారు. భారతదేశంలో కలవాలా? వద్దా? అంటూ ఆయన జనసమూహాన్ని ప్రశ్నించారు. ఈ ప్రతిపాదనలకు ప్రజల నుంచి పెద్ద ఎత్తున మద్దతు లభిస్తోంది. దీంతో భారత్తో కలిసేందుకు పీవోకే ఉద్యమం ఉధృతం చేయాలని JAAC నిర్ణయించింది.
రేషన్ సరఫరా నిలిపివేతపై ఆగ్రహం
PoKలో ఆహార సరఫరా, రేషన్పై ఆంక్షలు విధించారని JAAC నేతలు ఆరోపిస్తున్నారు. ఈ సమస్యపై గతంలో కూడా నిరసనలు జరిగాయి. జూన్లో రేషన్, పిండి, ఇతర నిత్యావసరాల సరఫరాపై ఆంక్షలు విధించారంటూ నిరసనకారులు ఆందోళన చేపట్టారు. అయితే పాకిస్థాన్ అధికారులు JAACపై తీవ్ర ఆరోపణలు చేస్తూ, ఆందోళనల వెనుక రాజకీయ, భద్రతాపరమైన ఉద్దేశాలు ఉన్నాయని చెబుతున్నారు.