మల్లన్నకో న్యాయం.. జడ్సన్‌కో న్యాయమా?

మల్లన్నకో న్యాయం.. జడ్సన్‌కో న్యాయమా?

రేవంత్ సర్కార్ చేపట్టిన కులగణన రిపోర్ట్‌ను తగలబెట్టిన సొంత పార్టీ ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న.. అయినా నో యాక్షన్

అదే రేవంత్‌కు వ్యతిరేకంగా జడ్సన్ కామెంట్స్ చేశారని.. ఆగమేఘాల మీద బహిష్కరణ వేటు

ఎస్సీ వర్గీకరణతో గొప్ప పని చేశామని చెప్పుకుంటున్న రేవంత్.. దళిత నేతను ఎందుకంత అత్యుత్సాహం ప్రదర్శించి సస్పెండ్ చేశారని ప్రశ్నలు…

జడ్సన్ గతంలో ఆరోపించిన అరోపణలు..

కాంగ్రెస్ నేత బక్క జడ్సన్ బహిరంగ లేఖ రాశారు. ఏ పదవి ఎవరికీ శాశ్వతం కాదన్నారు. పార్టీ మారిన నేతల పేరిట పార్టీలో ఉన్న సీనియర్లపై పరోక్ష విమర్శలు చేశారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. పార్టీలో సీనియర్లు ఎవరు ఉండకూడదని రేవంత్ కుట్ర చేస్తున్నారన్నారు. రేవంత్‌పై బక్క జడ్సన్ ప్రశ్నల వర్షం కురిపించారు. ‘ఇప్పటి వరకు నువ్వు ఏం ఉద్యమం చేశావ్? ప్రజల ఏం మేలు జరిగింది? మీరు చేసే ఏ ఉద్యమానికి సీనియర్లు అడ్డం వచ్చారు? ధరణి పై రైతులు కష్టాలు పడుతుంటే నువ్వు ఏం చేశావ్? మైనింగ్ మాఫియా మీద ఏం పోరాటం చేసినవ్? కవిత లిక్కర్ స్కాం పై ఏం పోరాటం చేశినవ్? మల్లన్న సాగర్‌లో మోటార్లు మునిగితే నువ్వు అక్కడికి వెళ్ళినవా? మిషన్ భగీరథ పై ఏం పోరాటం చేశావ్? నల్లాల ఓదెలు తిరిగి టీఆర్ఎస్‌లో ఎందుకు చేరిండు..? మియాపూర్ భూ కుంభకోణం పై ఏనాడైనా పోరాటం చేశావా? సీనియర్లు బీజేపీలోకి ఎందుకు వెళుతున్నారో చెప్పండి. టీఆర్ఎస్ ప్రభుత్వంతో సత్సంబంధాలు కొనసాగిస్తున్నట్లు మునుగోడులో అర్థమైంది’’ అని ఆరోపించారు..

మల్లన్న వ్యాక్యాలు..
ఏకు మేకు అవ్వడం కాదు.. ఏకంగా బల్లెంలా తయారైందంట.. సరిగ్గా కాంగ్రెస్‌లో ఆ పార్టీ ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న వ్యవహారం అలాగే తయారైందని పార్టీ శ్రేణులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి…

బీసీ గర్జన సభల్లో తీన్మార్ మల్లన్న సీఎం రేవంత్ రెడ్డిపై తీవ్ర విమర్శలు చేశారు. ఆయన తెలంగాణకు చివరి ఓసీ ముఖ్యమంత్రిగా మిగిలిపోతారని జోస్యం చెప్పారు. అలాగే రెడ్లు, వెలమలు అసలు తెలంగాణ వాసులే కాదంటూ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఈ వ్యాఖ్యలు కాంగ్రెస్ పార్టీలో తీవ్ర అసంతృప్తిని రేపాయి. పార్టీకి వ్యతిరేకంగా ఆయన చేస్తున్న వ్యాఖ్యలు, ప్రభుత్వాన్ని టార్గెట్ చేస్తున్న తీరు కాంగ్రెస్ నాయకత్వాన్ని ఆలోచనలో పడేసింది.

మల్లన్న తన భవిష్యత్తును బీసీ నాయకుడిగా మలచుకోవాలనే ప్రయత్నంలో ఉన్నారని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. ఆయన సీఎం కావాలనే లక్ష్యంతో బీసీ కార్డు ఉపయోగిస్తున్నారని ఆరోపణలు ఉన్నాయి. ముఖ్యంగా ఆయన గ్రూప్-1 నియామకాల్లో ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలను తీవ్రంగా వ్యతిరేకించారు. ఈ తరహా విమర్శలు పార్టీకి నష్టం కలిగిస్తాయని కాంగ్రెస్ అగ్రనేతలు భావిస్తున్నారు. ఈ పరిణామాలతో తీన్మార్ మల్లన్న భవిష్యత్తు ఏమిటనే ప్రశ్న ఉత్కంఠ రేపుతోంది. పార్టీ వ్యతిరేక

అసెంబ్లీలో బీసీ సర్వేపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేసిన ప్రకటన కాంగ్రెస్‌లో పెద్ద చర్చకు దారితీసింది. కాంగ్రెస్ ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న ఈ ప్రకటనపై తీవ్రంగా స్పందిస్తూ, సర్వే నివేదికను నకిలీగా అభివర్ణించారు…ముఖ్యమంత్రి ప్రకటన కాపీని దహనం చేసి తన వ్యతిరేకతను వ్యక్తం చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం ‘సామాజిక, ఆర్థిక, విద్య, ఉపాధి, రాజకీయ మరియు కుల సర్వే’ నిర్వహించిందని స్పష్టం చేస్తూ, దాన్ని పారదర్శకంగా చేపట్టామని ప్రకటించింది. కానీ, మల్లన్న మాత్రం ఈ సర్వేను పూర్తిగా నకిలీగా పేర్కొన్నారు..

కుల విద్వేషాలు రెచ్చగొడుతూ మల్లన్న చేస్తున్న ప్రసంగాలతో అసలు ఆయన పాలిటిక్స్‌కి సూట్ అవుతారా? అన్న డౌట్లు వ్యక్తమవుతున్నాయి. ఆర్. కృష్ణయ్య లాంటి బీసీ నేతల ప్రసంగాల్లో కనిపించే హుందాతనం ఇసుమంతైనా మల్లన్న మాటల్లో కనపడటం లేదు. కాంగ్రెస్ పార్టీ ద్వారా ఎమ్మెల్సీ పదవి అందుకున్న తీన్మార్ మల్లన్న ఈ తరహా వ్యాఖ్యలు చేయడంపై కాంగ్రెస్ పార్టీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు..