ఇంజనీరింగ్‌ విద్యార్థులు క్రిమినల్ వేస్ట్ అంటూ సీఎం రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలకు కౌంటర్ ఇచ్చిన మాజీ మంత్రి జగదీష్ రెడ్డి.

మోడీ లాగా రేవంత్ రెడ్డి కూడా బిల్ పాస్ చేసుకునేందుకు ఒక రోజు అసెంబ్లీ పెట్టుకున్నాడు..

అదేమన్న నీ కార్పొరేట్ దందా ఆఫీసా ఇష్టం వచ్చినట్టు పెట్టడానికి?..

వాళ్ళకంటే పెద్ద మేధావి నేనే అని రేవంత్ రెడ్డి పరోక్షంగా చెప్పుకున్నాడు.– జగదీష్ రెడ్డి

ఇంజనీరింగ్‌ విద్యార్థులు క్రిమినల్ వేస్ట్ అంటూ సీఎం రేవంత్ రెడ్డి చేసిన కామెంట్స్ చర్చనీయాంశమయ్యాయి. ఈ కామెంట్స్‌పై మాజీ మంత్రి జగదీష్‌ రెడ్డి మాట్లాడుతూ.. విద్యార్థులు కాదు క్రిమినల్ వేస్ట్ నువ్వే ఈ రాష్ట్రానికి క్రిమినల్ వేస్ట్ అని సీఎం రేవంత్ రెడ్డిపై ఫైర్ అయ్యారు. చదువుకున్నోడికి తెలుస్తది.. చదువు విలువ. చదువు రాని వాళ్లకు కూడా తెలుస్తదన్నారు..తెలంగాణ భవన్‌లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో జగదీష్ రెడ్డి మాట్లాడుతూ.. మేం చదువుకోలేకపోయినం.. మా పిల్లలన్నా చదువుకోవాలని చెప్పి తల్లిదండ్రులు తాపత్రయపడుతుంటరు. ఎందుకంటే చదువుతోనే వెలుగు.. చదువుతోనే ప్రపంచాన్ని చూడగలుగుతాం. కాబట్టి చదువు విషయంలో కేసీఆర్ స్పష్టంగా ఓ మాట చెప్పారు. ఒక తరానికి మనం నాణ్యమైన విద్యనందించి ప్రపంచంలో ఎవరితోనైనా పోటీ పడగలుగుతున్నామనే విశ్వాసాన్ని ఇచ్చి పంపిస్తే ఇక ఆ సమాజానికి తిరుగులేని సమాజం అన్నారు. దాని కోసమే కేసీఆర్ ప్రత్యేకించి దళితులు, గిరిజనులు, బలహీన వర్గాలతోపాటు మైనార్టీలను కూడా విద్య పట్ల ఆసక్తిని పెంచి 1000కి పైగా గురుకుల పాఠశాలలు పెట్టారు.

తెలంగాణలో ఇవాళ ఏ జెన్‌ జీ స్టూడెంట్‌ను పలకరించండి. ఇవాళ అద్భుతంగా హైదరాబాద్‌లో మాట్లాడుతున్న పిల్లలే కాదు.. నువ్వు నల్లగొండ పోతవా.. ? కరీంనగర్‌, ఆదిలాబాద్‌ పోతవా..? ఎక్కడైనా ఆ పిల్లలను మాట్లాడించు. ఢిల్లీ పిల్లలకో, అమెరికా పిల్లలకో ఏ మాత్రం తగ్గకుండా మాట్లాడుతరు.. చాలెంజ్ చేస్తున్నానన్నారు. రేవంత్ రెడ్డి లాంటి మూర్ఖుడిని విద్యాశాఖ మంత్రిగా ఉంచినందుకు 250 మందిని బలి తీసుకున్నాడు. రేవంత్ రెడ్డి లాగా కేసీఆర్ మాటలు చెప్పలేదు.. పని చేసి చూపించారని అన్నారు..