బొనస్ ని బోగస్ చేసి రైతులను దళారుల పాలు చేశారు.. మాజి మంత్రి జగదీష్ రెడ్డి..

సూర్యాపేట జిల్లా..

*ధాన్యం రైతుల ధర్నా , వికారాబాద్ ఘటన , కాంగ్రెస్ వైఫల్యాల పై మండిపడ్డ మాజీమంత్రి జగదీష్ రెడ్డి*

కాంగ్రెస్ సంవత్సర పాలనలో పరిస్థితులు తారుమారైయ్యాయి

అభివృద్ధి ఆగి ప్రభుత్వ శాఖలన్ని పడకేసాయి..

కేవలం వైఫల్యాల పై గొంతెత్తున్న వారిని అణచివేసేందుకు పోలీస్ శాఖ మాత్రమే పనిచేస్తుంది..

ప్రభుత్వ శాఖలన్ని వైఫల్యం చెందాయి..

ప్రభుత్వ పాఠశాలల్లో నాణ్యమైన ఆహారం లేక విద్యార్థులు ఆసుపత్రి పాలు..

ప్రభుత్వ ఆసుపత్రుల్లో మందులు లేవు..

సాగు నీరు లేక , మద్దతు ధర లేక రైతులు రోడ్డెక్కి ప్రభుత్వం పై తిరుగుబాటు చేస్తున్నారు..

కొత్తగా ఇళ్ళు కట్టించేదిపోయి ఉన్నయి కూలగొడుతున్నారు

వికారాబాద్ ఫార్మా కంపెనీకి వ్యతిరేకంగా స్థానికులు అధికారులను ప్రతిఘటిస్తున్నారు…

ధాన్యం , పత్తి కొనే దిక్కులేదు
నామ మాత్రంగా కొనుగోలు కేంద్రాలు ప్రారంభిస్తున్నారు..

ప్రభుత్వ నిర్లక్ష్యం దళారులకు కొమ్ముకాస్తున్నట్లుగా ఉంది..

దళారుల చేతుల్లో రైతుల దోపిడీకి కారణం మంత్రులే..

రైతులను దోపిడీ సొమ్ము వందల కోట్లు చేతులు మారుతున్నాయి..

చివరి గింజ వరకు మద్దతు ధరకు కొనుగోలు చేయాలని డిమాండ్..

బొనస్ ని బోగస్ చేసి రైతులను దళారుల పాలు చేశారు..

రైతుల దగా పై ప్రభుత్వ కుట్రను త్వరలోనే బయటపెడతాం.

వికారాబాద్ లో ప్రభుత్వ దుర్మార్గాన్నీ ఎదిరించి ఆత్మరక్షణకై రైతులు దాడులకు దిగాల్సిన పరిస్థితి వచ్చింది..

ప్రభుత్వ పరిపాలనకు వికారాబాద్ దాడి ఘటనే నిదర్శనం..

ఇచ్చిన హామీల పై నిలదీస్తుంటే
బాంబులు వేస్తామంటున్నారు…

రేవంత్ మాటలు సీఎం హోదాను దిగజార్చేలా ఉన్నాయి..

సంపుతాం నరకుతామనే కాంగ్రెస్ పాలసీని మేము పాటించి ఉంటే శవాలు దొరక్కుండా చేసేవాళ్ళం..

త్వరలోనే నల్లగొండ మంత్రి తో సహా సీఎం వరకు అందరి బండారం బయటపెడతాం..

మూసీ కంటే దుర్గంధమైన నోరుతో కేసీఆర్ ని దూషిస్తున్నారు..

అడ్డగోలుగా దూషిస్తే విసునూరు గడిలో శత్రువుల నోట్లో దుర్గంధం పోసినట్లు మీ నోళ్ళల్లో మూసీ నీళ్ళు పోయడం ఖాయం..

ఏడాదిలోనే ప్రభుత్వం ఫెయిల్ అయినందుకు సిగ్గుపడండి..

ఇక్కడ మీ నిర్వాకం చాలదని పక్క రాష్ట్రాల్లో ప్రచారం చేసి అక్కడ ఎసరు పెడుతున్నారు..

రేవంత్ వ్యవహారంతో కాంగ్రెస్ కి ఇక చివరి రోజులే…