*సూర్యాపేట జిల్లా..*
రైతుల పట్ల కాంగ్రెస్ ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరుపై మండిపడుతూ సూర్యాపేట జిల్లా కేంద్రంలోని క్యాంపు కార్యాలయంలో మీడియాతో మాట్లాడిన మాజీ మంత్రివర్యులు సూర్యాపేట శాసనసభ్యులు గుంటకండ్ల జగదీష్ రెడ్డి..
*మాజీ మంత్రి జగదీష్ రెడ్డి మాట్లాడుతూ..
తెలంగాణ కు పట్టిన పీడ కాంగ్రెస్ దయ్యమే..
రేవంత్ అనే భూతం ఈ రాష్టాన్ని నాశనం చేస్తుంది..
అందుకే తెలంగాణాలో నీళ్లు, అభివృద్ధి కుంటుబడినయ్..
ప్రజలు ఏమడిగినా ఎల్నినో సాకుతో కాంగ్రెస్ నాయకులు తప్పించుకునే ప్రయత్నం చేస్తున్నారు.
కన్నెపల్లి పంపుహౌజ్ ఇవ్వాళ ప్రారంభించిన నీళ్లు సిద్ధంగా ఉన్నాయి..
సాగర్ ఎడమ కాలువ ద్వారా 11 వేల క్యూసెక్కుల నీళ్లు ఇచ్చే పరిస్థితి వున్నా.. కేవలం 7 వేల క్యూ సెక్కులు మాత్రమే ఇస్తున్నారు..
రైతులు పంటలు వేసుకోవాలా వద్దా అని స్పష్టంగా చెప్పమంటే సమాధానమే లేదు..
మన నీళ్లను దోచుకుపోతుంటే కేఆర్ఎంబికి ఉత్తరం రాయాలన్న సోయికూడా ఈ ప్రభుత్వానికి లేదు..
ఇంతకన్నా తక్కువ నీళ్ళున్న సమయంలోనే పంటలు బ్రహ్మాండంగా పండించుకున్నాం..
ఆనాడే వాళ్ల బాసులైనా చంద్రబాబు మెడలు వంచి తెలంగాణను సస్యశ్యామలం చేసుకున్నాం..
కృష్ణా, గోదావరి నీళ్లు పుష్కలంగా వచ్చినా పంటలు ఎండబెడుతుండ్రు..
కండ్లముందే ఆంధ్రకు నీళ్లు దోచుకుపోతుంటే.. కాబోదుల్లా ఇక్కడి సీఎం, మంత్రులు వ్యవహారిస్తున్నరు..
పంటలు పండనియొద్దనే కాంగ్రెస్ ప్రభుత్వం కక్షగట్టింది..
పంటలు పండితే నీళ్లు, కరెంటు, బోనస్ లు ఇవ్వాల్సివస్తదనే కుట్రలు చేసిండ్రు..
రైతుల పట్ల నిర్లక్ష్యం, నిర్లజ్జగా వ్యవహరిస్తున్నారు..
కెసిఆర్ ఆనాడే పాదయాత్ర చేసి పంటలు కాపాడిండు..
ఇవ్వాళ రైతుల తరుపున ఎటువంటి పోరాటానికైనా KTR సిద్ధంగా ఉన్నడు..
ఒక్క ఎకరం కూడా ఎండనీయ్యొద్దని మిర్యాలగూడ రైతు ధర్నాలో KTR స్పష్టంగా చెప్పిండు..
మరొమారు పాదయాత్రలు చేసైనా సరే రైతుల పంటలు ఎండకుండా పోరాడతాం..