బిజేపీ ఎంపీ ఈటల రాజేందర్ పై కాంగ్రెస్ నేత జగ్గారెడ్డి తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. రాజేందర్ మెంటల్ అయిపోయిండని ఫైర్ అయ్యారు. ఇంకో సారి సీఎం రేవంత్ రెడ్డి గురించి మాట్లాడితే నడి రోడ్డుపై గుంజీలు తీయిస్తానని సీరియస్ కామెంట్స్ చేశారు. ఈటల రాజేందర్ ఇప్పటికైనా నల్లికుట్ల రాజకీయాలు మానుకోవాలని సూచించారు. లిమిట్స్ దాటి నువ్వు మాట్లాడావు.. అందుకే నేను లిమిట్స్ దాటి సమాధానం ఇస్తున్నానని జగ్గారెడ్డి పేర్కొన్నారు. ఆదివారం గాంధీ భవన్లో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై ఈటల రాజేందర్ చేసిన కామెంట్స్పై జగ్గారెడ్డి ఫైర్ అయ్యారు.
మల్కాజిగిరి నియోజకవర్గ ప్రజల సమస్యలపై ఒక్కరోజు కూడా ఈటల మాట్లాడలేదని అన్నారు. బీజేపీలో కోరుకున్న పదవులు రాకపోయేసరికి గంజాయి తాగిన వాడి లెక్క.. ఓ సైకో లాగా మారిపోయాడని ఎద్దేవా చేశారు. బూతులు మాట్లాడేవారికి బూతులతోనే సమాధానం చెబుతానని జగ్గారెడ్డి స్పష్టం చేశారు. పదవి రాలేదని ప్రస్టేషన్లో ఈటల మాట్లాడుతున్నాడని ఎద్దేవా చేశారు. నిన్ను చూసి జాలిపడి సీఎం రేవంత్ రెడ్డి వదిలేస్తున్నాడేమో కానీ.. మేము అలా వదిలేయమని హెచ్చరించారు.