జగిత్యాల జిల్లాలో ఆర్టీసీ బస్సు, స్కూల్ బస్సు ఢీ..

జగిత్యాల పట్టణంలోని యావర్‌ రోడ్‌లో ఆర్టీసీ బస్సు, ప్రైవేట్‌ పాఠశాల బస్సు ఢీ కొన్నాయి. పాఠశాల బస్సులో 20 మంది విద్యార్థులు ఉండగా నలుగురు పిల్లలకు స్వల్ప గాయాలయ్యాయి. పెను ప్రమాదం తప్పటంతో ఊపిరి పీల్చుకున్నారు. పాఠశాల బస్సు డ్రైవర్‌ రోడ్డు క్రాస్‌ చేసే సమయంలో జగిత్యాల కొత్త బస్టాండ్‌ నుంచి పాత బస్టాండ్‌ వెళుతున్న ఆర్టీసీ బస్సు పాఠశాల బస్సును ఢీకొట్టింది. ఇందుకు సంబందించి సీసీ కెమేరా దృశ్యాలు నిక్షిప్తమయ్యాయి. ప్రమాద సమయంలో విద్యార్థులు భయందోళనకు గురయ్యారు. హుటాహుటిన విద్యార్థుల తల్లిదండ్రులు వచ్చి వారిని ఇంటికి తీసుకెల్లారు. ఘటన స్థలానికి చేరుకున్న ట్రాఫిక్‌ పోలీసులు ప్రమాద వివరాలు సేకరించారు.