జగిత్యాల జిల్లా మెట్ పల్లిలో చైనా మాంజాతో నాలుగేళ్ళ బాలుడికి తీవ్ర గాయాలు..!

జగిత్యాల జిల్లా మెట్ పల్లిలో చైనా మాంజాతో నాలుగేళ్ళ బాలుడికి తీవ్ర గాయాలు….

నిజామాబాద్ ఆసుపత్రిలో చికిత్స..

మెట్ పల్లిలోని దుబ్బవాడుకు చెందిన శ్రీహస్ అనే బాలుడు తన ఇంటి ముందు ఆడుకుంటుండగా మెడకు చైనా మాంజా చుట్టుకుని తీవ్ర గాయాలయ్యాయి. వెంటనే స్థానికులు ఆసుపత్రికి తరలించారు. మెడ తెగడంతో పరిస్థితి విషమంగా మారడంతో నిజామాబాద్ ఆసుపత్రికి తరలించగా మెడ వద్ద దాదాపు 16 కుట్లు వేశారు. ప్రస్తుతం బాలుడు శ్రీహస్ ఆసుపత్రిలో కోలుకుంటున్నాడు., పట్టణంలో మాంజా విక్రయిస్తున్న వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు..

గమనిక.. మీ ప్రాంతాల్లో A TO Z వార్తలు ఏదైనా..మాకు సమాచారం అందించండి.
వాట్సాప్..+91 91330 57959