మరో ఇద్దరు ఎమ్మెల్యేలకు క్లీన్ చిట్..కాలే యాదయ్య, పోచారం శ్రీనివాస్ రెడ్డిలు పార్టీ మారరనడానికి తగిన ఆధారాలు లేవన్న స్పీకర్..
మరో ఇద్దరు ఎమ్మెల్యేలకు క్లీన్ చిట్..
కాలే యాదయ్య, పోచారం శ్రీనివాస్ రెడ్డిలు పార్టీ మారరనడానికి తగిన ఆధారాలు లేవన్న స్పీకర్..
కాలే యాదయ్య, పోచారం శ్రీనివాస్ రెడ్డిలను బీఆర్ఎస్ ఎమ్మెల్యేలుగా గుర్తిస్తున్నట్లు తీర్పు వెలువరించిన స్పీకర్..
గతంలో ఐదుగురు ఎమ్మెల్యేల విషయంలోనూ ఇదే తీర్పు ఇచ్చిన స్పీకర్..
పెండింగ్ లో ముగ్గురు ఫిరాయింపు ఎమ్మెల్యేల కేసు…
పెండింగ్ లో దానం నాగేందర్, కడియం శ్రీహరి, సంజయ్ కేసు..
త్వరలోనే ముగ్గురు ఎమ్మెల్యేల కేసులో కూడా తీర్పు చెప్పనున్న స్పీకర్..
మొత్తంగా ఏడుగురు ఎమ్మెల్యేలకు క్లీన్చిట్ : ఇప్పటికే ఐదుగురు ఎమ్మెల్యేలకు స్పీకర్ గడ్డం ప్రసాద్ క్లీన్చిట్ ఇచ్చిన విషయం తెలిసిందే. ఇవాళ మరో ఇద్దరికి క్లీన్చిట్ ఇచ్చిన ఆయన మరో ఎమ్మెల్యేకు సంబంధించి తీర్పు రిజర్వులో ఉంచారు. జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ అనర్హత పిటిషన్‌పై విచారణ పూర్తి చేశారు. దానం నాగేందర్, కడియం శ్రీహరి అనర్హత పిటిషన్లపై ఇంకా విచారణ పూర్తికాలేదు. ఎమ్మెల్యేలు దానం నాగేందర్, కడియం శ్రీహరిలకు చెందిన అనర్హత పిటిషన్లపై విచారణ కొనసాగాల్సి ఉంది.
అనర్హత పిటిషన్లు కొట్టేసిన స్పీకర్ : నోటీసులు ఇచ్చిన తర్వాత నెలల సమయం తీసుకున్న ఎమ్మెల్యే కడియం శ్రీహరి స్పీకర్‌కు తన సమాధానాన్ని రాతపూర్వకంగా సమాధానం ఇచ్చారు. దీంతో నోటీసులు స్వీకరించిన వారిలో ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ ఒక్కరే సమాధానం ఇవ్వనట్లుగా కనిపిస్తోంది. ఎమ్మెల్యేలు తెల్లం వెంకట్రావు, బండ్ల కృష్ణమోహన్‌రెడ్డి, గూడెం మహిపాల్‌రెడ్డి, టి.ప్రకాశ్‌గౌడ్, అరెకపూడి గాంధీలపై దాఖలైన అనర్హత పిటిషన్లను స్పీకర్ కొట్టివేసిన సంగతి తెలిసిందే.
ఫిర్యాదులు, రికార్డుల్లో ఉన్న ఆధారాల పరిశీలన, అలాగే సంబంధిత అన్ని పక్షాలకు సహజ న్యాయ సూత్రాలకు అనుగుణంగా పూర్తి వాదనలు వినే అవకాశం కల్పించిన అనంతరం స్పీకర్ తన నిర్ణయాన్ని వెలువరించారు. పదో షెడ్యూల్లోని పేరా 6 ప్రకారం ట్రైబ్యునల్ ఛైర్మన్‌గా వ్యవహరిస్తూ తెలంగాణ శాసనసభ(పార్టీ మార్పు కారణంగా అనర్హత) నియమాలు-1986 ఆధారంగా స్పీకర్ ఈ తీర్పునిచ్చారు.