జామ్మూకశ్మీర్లోని శ్రీనగర్లో విషాద ఘటన చోటుచేసుకుంది. ఊపిరాడక ఒకే కుటుంబానికి చెందిన ఐదుగురు మృతి చెందారు. శ్రీనగర్ జిల్లాలోని పంద్రథాన్ ప్రాంతంలో ముగ్గురు పిల్లలతో కలిసి అద్దె ఇంటిలో ఓ కుటుంబం ఉంటుంది…అకస్మాత్తుగా ఊపిరాడక స్పృహతప్పి పడిపోయారు. వెంటనే స్థానికులు గమనించి వైద్యుని తీసుకొచ్చిన ప్రయోజనం లేకపోయింది.
హీటర్ కారణంగానే..
డాక్టర్ వచ్చేలోగా ఆ కుటుంబమంతా మృతి చెందారు. అయితే ఈ విషాదానికి హీటింగ్ పరికరాలనే కారణమని పోలీసులు భావిస్తున్నారు. గ్యాస్ హీటర్లు వంటివి జాగ్రత్తగా ఉపయోగించకపోవడం వల్ల ఊపిరిఆడలేదని అంటున్నారు. ఎందుకంటే హీటర్ల వల్ల కార్బన్ మోనాక్సైడ్ ఉత్పత్తి అవుతుంది. దీనిని పీల్చడం వల్ల వెంటనే స్పృహతప్పి పడిపోతారు. హీటర్లు వాడేటప్పుడు లోపలకి వెంటిలేషన్ ఉండాలి. లేకపోయిన కూడా ప్రమాదం జరుగుతుందని పోలీసులు చెబుతున్నారు..