మాధవి లతకు జేసీ ప్రభాకర్ రెడ్డి క్షమాపణలు…!

సినీ నటి, బీజేపీ నాయకురాలు మాధవి లతకు తాడిపత్రి మున్సిపల్ చైర్మన్ జేసీ ప్రభాకర్ రెడ్డి క్షమాపణలు చెప్పారు. మాధవి లత గురించి ఆవేశంలో మాట్లాడటం తప్పేనని అంగీకరించారు..ఆమెకు మనస్ఫూర్తిగా క్షమాపణలు చెబుతున్నట్లు ప్రకటించారు. ఇదే విషయమై మీడియాతో మాట్లాడిన జేసీ.. మాధవి లతపై తాను చేసిన వ్యాఖ్యలపై బేషరతుగా క్షమాపణలు చెబుతున్నట్లు ప్రకటించారు. తన వయసు 72 సంవత్సరాలు అని.. ఆవేశంలో మాట్లాడానే తప్ప ఎవరికీ కించపరచాలనే ఉద్దేశంతో మాట్లాడలేదన్నారు. ఎవరి బ్రతుకుతెరువు వారిదేనని అన్నారు. తనను పార్టీ మారమని చెప్పే హక్కు ఎవరికీ లేదని జేసీ ఉద్ఘాటించారు. తన గురించి మాట్లాడిన రాజకీయ నాయకులందరూ ఫ్లెక్సీ గాళ్లేనంటూ విమర్శించారు. తాడిపత్రి కోసం ఎంత వరకైనా వెళ్తానని జేసీ మరోసారి వ్యాఖ్యానించారు…