కోనసీమ జిల్లాలోని అంతర్వేది సముద్ర తీరంలో విష పురుగులు..
Jelly Fish in Beach
అంతర్వేది బీచ్లో కొందరు పర్యాటకులపై దాడి చేసిన విష పురుగులు..
విష పురుగులు వాలడంతో దురద, మంటలు, దద్దుర్లు వచ్చి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న పర్యాటకులు..
వీటిని జెల్లీ ఫిష్ అని, సీ డ్రాగన్ ఫిష్ అని పిలుస్తారని తెలిపిన స్థానిక మత్స్యకారులు….
ఏపీలోని అంబేడ్కర్ కోనసీమ జిల్లాలోని అంతర్వేది సముద్ర తీరంలో జెల్లీ ఫిష్లు కలకలం రేపుతున్నాయి. హైడ్రోజోవా తరగతికి చెందిన ఈ విష పురుగులు పెద్దఎత్తున తీరంలో ఉంటున్నాయి. ‘అగ్గిబాటా’ అని పిలిచే వీటిని పొరపాటున తాకినా, అందంగా ఉన్నాయని పట్టుకున్నా కూడా సమస్యలు తప్పవని స్థానికులు అంటున్నారు…సముద్ర తీరంలో భారీ గాలులు రావడంతో ఇవి బీచ్ నిండా వ్యాపిస్తున్నాయి. వీటిని తాకితే వికారం, తలనొప్పి, వాంతులు, అలర్జీ, దురద వంటి సమస్యలు వస్తున్నాయని అంటున్నారు. వీటికి ఉప్పు నీరు ఉపశమనం ఇస్తాయి. అప్పటికీ కూడా తగ్గకపోతే మాత్రం వైద్యులను సంప్రదించాలి. తాకడం వల్ల మంట, దురద, దద్దర్లు వంటివి వస్తాయి.. కానీ ప్రాణాంతకం కాదంటున్నారు. అయితే కొన్ని సందర్భాల్లో ప్రాణాలు కూడా కోల్పోయే ప్రమాదం ఉందని నిపుణులు చెబుతున్నారు..