రేవంత్ రెడ్డి.. ఇక కాస్కో
కాంగ్రెస్‌కి మాజీ మంత్రి జీవన్ రెడ్డి రాజీనామా.. రేవంత్ రెడ్డిపై సంచలన వ్యాఖ్యలు..
రేవంత్ వల్లే మహబూబ్ నగర్, చేవెళ్ల, సికింద్రాబాద్ ఎంపీలు కాంగ్రెస్ ఓడిపోయింది
దానం బీఆర్ఎస్ ఎమ్మెల్యేగా ఉంటూ.. కాంగ్రెస్ ఎంపీగా పోటీ చేయడం దేనికి సంకేతం
ఎవడయ్యా ఈ పోచారం శ్రీనివాస్ రెడ్డి? ఆయనకు, కాంగ్రెస్‌కి ఏం సంబంధం ఉంది ?
ఆయన్ను ప్రభుత్వ సలహాదారుడిగా నియమించిన తర్వాత ఇచ్చిన సలహాలు ఎన్ని?
వేం నరేందర్ ఎవరు? ఎక్కడ నుంచి వచ్చాడు? ఆయన కాంగ్రెస్‌కి చేసిన సేవ ఏంది ?
అడ్డొస్తే తొక్కుతానని రేవంత్ రెడ్డి అంటున్నాడు.. ఎంత మందిని తొక్కుతావు నువ్వు ?
రేవంత్ రెడ్డి.. ఇక కాస్కో.. నిన్ను ఎదిరించి పోరాటం చేస్తా.. నాకు పోయేది ఏమి లేదు
నేను కొంతమంది లాగా డబ్బులతో ముఖ్యమంత్రి అయ్యేందుకు కాంగ్రెస్‌లోకి రాలేదు..
ఫిరాయింపులు వద్దని, జగిత్యాల ఎమ్మెల్యేను పార్టీలోకి తీసుకోవద్దని చెప్పినా వినలేదు.m
తనకు తోడుగా నిలిచిన నాయకుడు చనిపోతే రేవంత్ రెడ్డి కనీస పరామర్శకు రాలేదు..
బాధతో పార్టీని వీడుతున్నా..
పార్టీ ఫిరాయింపులు మంచిది కాదని చెప్పినా వినిపించుకోలేదని జీవన్ రెడ్డి (Jeevan Reddy) అన్నారు. జగిత్యాలలో ఎమ్మెల్యేను పార్టీలోకి తీసుకోవద్దని చెప్పినా వినలేదని పేర్కొన్నారు. తాను, తన కార్యకర్తలు అనేక ఇబ్బందులు, అవమానాలు ఎదుర్కొన్నామని ఆవేదన వ్యక్తం చేశారు. తీవ్రమైన బాధతో పార్టీని వీడుతున్నాని ప్రకటించారు..
దానం నాగేందర్ (Danam Nagender) బీఆర్ఎస్ ఎమ్మెల్యేగా ఉంటూ, కాంగ్రెస్ గుర్తుపై ఎంపీగా పోటీ చేయడం దేనికి సంకేతమని జీవన్‌రెడ్డి ప్రశ్నించారు. ఆయనను రాజీనామా చేయించి పోటీ చేయించాల్సిందని చెప్పారు. అందుకే సికింద్రాబాద్ ఎంపీ సీటును కాంగ్రెస్ పార్టీ (Congress Party) ఓడిపోయిందని తెలిపారు. సీఎం రేవంత్ రెడ్డి నిర్ణయాలతో ఆయన సొంత పార్లమెంట్ మహబూబ్ నగర్లో పార్టీ ఓడిపోయిందన్నారు. తాను రేవంత్ రెడ్డిని ఎదిరించి పోరాటం చేస్తానని జీవన్‌రెడ్డి అన్నారు. ఆయనతో అణగదొక్కించుకోవడం కంటే పోరాటం చేస్తే తనకు పోయేది ఏమి లేదన్నారు..
ఎంతమందిని తొక్కుతావు
తనకు ఎవరైనా అడ్డం వస్తే తొక్కుతా అని రేవంత్ రెడ్డి అంటున్నారని జీవన్‌రెడ్డి అన్నారు. ఎంతమందిని తొక్కుతారని ప్రశ్నించారు. జగిత్యాలలో ఏ శక్తి తనను ఆపలేదన్నారు. కొంతమంది లాగా ముఖ్యమంత్రి అయ్యేందుకు తాను కాంగ్రెస్ పార్టీలోకి రాలేదన్నారు. రేవంత్‌రెడ్డి తమను కూడా బతకనివ్వాలన్నారు. విధి లేని పరిస్థితుల్లో రాజీనామా నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. తాను రోడ్డు ఎక్కితే ఎవ్వరూ పట్టించుకోలేదని ఆవేదన వ్యక్తం చేశారు.