JK LG Manoj Sinha on Pakistan : భారత సాయుధ దళాలకు పాకిస్థాన్లో చేరుకోలేని ప్రాంతం అంటూ ఏదీ లేదని జమ్ముకశ్మీర్ ఎల్జీ మనోజ్ సిన్హా అన్నారు. శనివారం నియంత్రణ రేఖ వెంబడి ఉన్న తంగ్ధర్ సెక్టార్లో సైనిక సిబ్బందితో ఎల్జీ మనోజ్ సిన్హా మాట్లాడుతూ ఈ మేరకు వ్యాఖ్యలు చేశారు. భారత్ను లక్ష్యంగా చేసుకునే ఉగ్రవాద గ్రూపులకు మద్దతు ఇవ్వడంపై పాకిస్థాన్కు వార్నింగ్ ఇచ్చారు.
‘భారత సాయుధ దళాల ధైర్యాన్ని యావత్ ప్రపంచం చూసింది. ఆ తర్వాత వాళ్లు (పాకిస్థాన్) ఎప్పుడూ యుద్ధానికి అనుకూలంగా లేమని, శాంతియుతంగా జీవించాలనుకుంటున్నామని ప్రపంచ మొత్తానికి విజ్ఞప్తి చేయడం ప్రారంభించారు. ప్రపంచంలోనే మనం ఐదో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా ఉన్నాం. మరికొన్ని రోజుల్లో నాలుగో స్థానానికి ఎదగాలని అనుకుంటున్నాం. అభివృద్ధి చెందిన భారత్ అనే కలను నిజం చేసుకునేందుకు మనం ముందుకు సాగుతున్నాం. కానీ పాకిస్థాన్ మాత్రం రుణం అనే బలంతో మానవత్వాన్ని నాశనం చేయాలనే ప్రయత్నంలో ఉంది. మనం ఇచ్చిన ప్రతిస్పందనతో పాక్ గుణపాఠం నేర్చుకుందని నేను అనుకుంటున్నా. భారత సైన్యానికి పాకిస్థాన్లో ఏ ప్రాంతాన్ని అయినా టార్గేట్ చేయగలదు. ధైర్యం, సామర్థ్యం, దేశం పట్ల ఉన్న మీ అంకితభావానికి సెల్యూట్ చేస్తున్నా. అలాంటి సంక్షోభం వచ్చినప్పుడల్లా, మన దేశం మీలాంటి వీరుల చేతుల్లో సురక్షితంగా ఉందని ప్రజలు తెలుసుకోవాలి’ అని మనోజ్ సిన్హా అని అన్నారు…