క్రీడల్లో ప్రతిభ కనబరిచిన అభ్యర్థులకు ప్రభుత్వ ఉద్యోగాలు…

క్రీడల్లో ప్రతిభ కనబరిచిన అభ్యర్థులకు ప్రభుత్వ ఉద్యోగం సాధించేందుకు ఇది ఒక సువర్ణావకాశం. గుజరాత్ రీజియన్‌లో మొత్తం 46 పోస్టుల భర్తీకి దరఖాస్తులను ఆహ్వానిస్తున్నారు…
పోస్టుల సంఖ్య: 46 (MTS, ట్యాక్స్ అసిస్టెంట్).
అర్హత: MTS: పదో తరగతి ఉత్తీర్ణత.
ట్యాక్స్ అసిస్టెంట్: గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి డిగ్రీ పూర్తి చేసి ఉండాలి.
క్రీడా అర్హతలు: జాతీయ, అంతర్జాతీయ పోటీలు, ఇంటర్ యూనివర్సిటీ టోర్నమెంట్లు లేదా ఖేలో ఇండియా క్రీడల్లో పతకాలు సాధించిన వారు మాత్రమే అర్హులు.
ఎంపిక విధానం: దరఖాస్తు చేసుకున్న వారి క్రీడా ప్రతిభ ఆధారంగా షార్ట్ లిస్ట్ చేసి, రాత పరీక్ష మరియు డాక్యుమెంట్ వెరిఫికేషన్ ద్వారా ఎంపిక చేస్తారు.
ముఖ్య తేదీలు & ఫీజు:
చివరి తేదీ: ఫిబ్రవరి 21, 2026.
దరఖాస్తు ఫీజు: రూ. 200.
వెబ్‌సైట్: incometaxgujarat.gov.in