టాలీవుడ్లో మెగాస్టార్ చిరంజీవి పేరు వినిపించగానే అంచనాలు సహజంగానే ఆకాశాన్ని తాకుతాయి. ఆయన నటిస్తున్న ప్రతి సినిమా ఓ సంచలనంగా మారుతుంటుంది.
ప్రస్తుతం చిరంజీవి యువ దర్శకుడు వశిష్ట దర్శకత్వంలో నటిస్తున్న సోషియో-ఫాంటసీ చిత్రం ‘విశ్వంభర'(Vishwambhara)పై భారీ స్థాయిలో హైప్ నెలకొంది.
ఈ సినిమాలో చిరంజీవి గతంలో చేసిన క్లాసిక్ హిట్స్‌కు చెందిన షేడ్స్ కనిపించనున్నాయని సమాచారం.
ముఖ్యంగా ‘జగదేకవీరుడు అతిలోకసుందరి’లోని అద్భుతమైన ఫాంటసీ అంశాలు, వినోదం… అలాగే ‘హిట్లర్’ చిత్రంలో ప్రేక్షకులను కదిలించిన అన్న-చెల్లెళ్ల సెంటిమెంట్—ఈ రెండు భావోద్వేగాల మేళవింపు ‘విశ్వంభర’లో హైలైట్‌గా నిలవనుందని టాక్.
సృష్టి, స్థితి, లయ అనే తత్వాల చుట్టూ తిరిగే ఈ కథలో చిరంజీవి విశ్వంభరుడుగా ప్రేక్షకుల ముందుకు రానున్నారు…
గా అభిమానుల నుంచి కొంత అసంతృప్తి
అయితే ఇటీవల విడుదలైన టీజర్‌లోని గ్రాఫిక్స్ (VFX)పై మెగా అభిమానుల నుంచి కొంత అసంతృప్తి వ్యక్తమైంది.
ఈ నేపథ్యంలో మేకర్స్ ఎలా స్పందిస్తారు? సినిమా అసలు నేపథ్యం ఏంటి? అనే ప్రశ్నలపై తాజాగా ఓ ఆసక్తికర అప్డేట్ వెలుగులోకి వచ్చింది.
ఇటీవల జరిగిన ఓ సినిమా ఈవెంట్లో యూవీ క్రియేషన్స్ ప్రతినిధి అజయ్ కుమార్ ఈ విషయంపై స్పందించారు. టీజర్‌లోని విజువల్స్‌పై వచ్చిన ఫీడ్‌బ్యాక్‌ను మేము గమనించాం. పెద్ద స్థాయి సినిమాలు తెరకెక్కించేటప్పుడు ఇలాంటి అభిప్రాయాలు రావడం సహజం..
ముఖ్యంగా జులై 10వ తేదీని రిలీజ్ డేట్‌గా చిత్ర యూనిట్ పరిశీలిస్తున్నట్లు సమాచారం. ఈ ప్రతిష్టాత్మక చిత్రానికి ఆస్కార్ విజేత ఎం.ఎం. కీరవాణి సంగీతం అందిస్తుండటం విశేషం. అత్యాధునిక విజువల్ ఎఫెక్ట్స్, భారీ సెట్టింగ్‌లతో రూపొందుతున్న ఈ సినిమా, టాలీవుడ్లో మరో విజువల్ వండర్‌గా నిలుస్తుందని ఇండస్ట్రీ వర్గాలు భావిస్తున్నాయి.