మున్సిపల్ ఎన్నికల వేళ.. బీజేపీ నుండి బీఆర్ఎస్ లోకి చేరికలు..
నాగార్జున సాగర్ నియోజకవర్గానికి చెందిన బీజేపీ సీనియర్ నేత, బీజేపీ మాజీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు రిక్కాల ఇంద్రసేనారెడ్డి తమ అనుచరులతో కలిసి బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సమక్షంలో బీఆర్ఎస్ లో చేరారు. ఈ సందర్భంగా కేటీఆర్ వారికి పార్టీ కండువా కప్పి, పార్టీలోకి ఆత్మీయంగా ఆహ్వానించారు.
ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే నోముల భగత్, ఎమ్మెల్సీ కోటి రెడ్డి, మాజీ ఎమ్మెల్యే తిప్పన విజయసింహ రెడ్డి , మాజీ జెడ్పీ చైర్మన్ గుజ్జ దీపికా యుగేందర్ రెడ్డి, మాజీ ఆప్కాబ్ చైర్మన్ ఎడవెళ్లి విజేందర్ రెడ్డి ఉన్నారు.