Jubilee Hills BYE Election: జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక పోలింగ్ ప్రారంభం.. Live update..

షేక్‌పేటలో కుటుంబసభ్యులతో కలిసి ఓటు వేసిన దర్శకుడు రాజమౌళి.

బోరబండ నాట్‌కో పాఠశాల బూత్‌లో మొరాయించిన ఈవీఎం.

మరమ్మతు చేసిన అధికారులు, యథావిధిగా కొనసాగుతున్న పోలింగ్‌.
Jubilee Hills BYE Election.

*• జూబ్లీహిల్స్ నియోజకవర్గం లో 7 డివిజన్లు.

*• డివిజన్ ల వారిగా ఓట్ల సంఖ్య, పోలింగ్ బుత్ ల సంఖ్య.

రహమత్ నగర్….70,583 ఓట్లు,

72 పోలింగ్ బుత్ లు.

షేక్ పేట….70,546 ఓట్లు,
70 పోలింగ్ బుత్ లు.

ఎర్రగడ్డ….59,580 ఓట్లు,
63 పోలింగ్ బుత్ లు.

యూసఫ్ గూడ….58,599 ఓట్లు,
56 పోలింగ్ బుత్ లు.

*వెంగళరావు నగర్…54,620 ఓట్లు,

58 పోలింగ్ బుత్ లు.

*బోరబండ….52,754 ఓట్లు,
50 పోలింగ్ బుత్ లు

*సోమాజిగూడ…32,300 ఓట్లు,

38 పోలింగ్ బుత్ లు..

జూబ్లీహిల్స్‌ ఉపఎన్నిక పోలింగ్‌ (Jubilee Hills By-Election) ప్రారంభమైంది. సాయంత్రం 6 గంటల వరకు పోలింగ్‌ కొనసాగనుంది. గతంలో ఎన్నడూ లేనంతగా ఈ సారి పోలింగ్‌ సమయాన్ని అదనంగా గంట పాటు ఎన్నికల సంఘం పొడిగించింది..

నెల రోజులుగా నువ్వా-నేనా అన్నట్లు హోరాహోరీగా సాగిన జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక పోలింగ్ ప్రారంభమైంది. సాయంత్రం 6 గంటల వరకు పోలింగ్ జరగనుంది. ముగ్గురు ప్రధాన పార్టీల అభ్యర్థులతో పాటు 58 మంది బరిలో నిలిచారు. నియోజకవర్గ పరిధిలో 4 లక్షలకు పైగా ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు.

ఓటు హక్కును వినియోగించుకునేందుకు 139 ప్రాంతాల్లో 407 పోలింగ్ కేంద్రాలను ఎన్నికల సంఘం ఏర్పాటు చేసింది. ఎటువంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా ప్రతి పోలింగ్ కేంద్రం వద్ద మూడంచెల భద్రతతో పాటు 139 డ్రోన్లతో నిరంతర నిఘాను ఉంచి భద్రతా సిబ్బంది పర్యవేక్షిస్తున్నారు. బీఆర్ఎస్ తరఫున మాగంటి గోపీనాథ్ భార్య సునీత, కాంగ్రెస్ తరఫున నవీన్ యాదవ్, బీజేపీ తరఫున లంకల దీపక్రెడ్డి పోటీ చేస్తున్నారు. ఈ నెల 14న ఓట్ల లెక్కింపు జరగనుంది…

ఇక, ఎన్నికల నిర్వహణకు 5 వేల మంది సిబ్బంది ఉన్నారు…. 139 ప్రాంతాల్లో 407 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేశారు.. 1,761 మంది పోలీసులతో భద్రతా ఏర్పాట్లు చేశారు.. 800 మంది కేంద్ర బలగాలు బందోబస్తులో ఉన్నారు.. 139 ప్రాంతాల్లో 139 డ్రోన్లు వినియోగిస్తున్నారు.. సమస్యాత్మక ప్రాంతాల్లో సీసీ కెమెరాలు & డ్రోన్ల ద్వారా మానిటరింగ్‌ చేస్తున్నారు ఎన్నికల అధికారులు.. మరోవైపు ఎన్నికల బరిలో 58 మంది అభ్యర్థులు ఉన్నారు..

జూబ్లీహిల్స్‌లో ఓటు వేసిన బీఆర్ఎస్ అభ్యర్థి మాగంటి సునీత
జూబ్లీహిల్స్‌లో ఓటు వేసిన బీఆర్ఎస్ అభ్యర్థి మాగంటి సునీత
ఎల్లారెడ్డిగూడ శ్రీనగర్ కాలనీలో ఓటు వేసిన మాగంటి సునీత
జూబ్లీహిల్స్‌ ప్రజలంతా ఓటుహక్కు వినియోగించుకోవాలి: సునీత
.

కొనసాగుతున్న జూబ్లీహిల్స్ ఉపఎన్నిక పోలింగ్
జూబ్లీహిల్స్‌లో ఉదయం 9 వరకు 9.2 శాతం పోలింగ్..

రెహమత్‌నగర్లో మొరాయించిన ఈవీఎం – 40 నిమిషాలు ఆలస్యంగా పోలింగ్‌ ప్రారంభం
ఈవీఎం..

బోరబండలో కాంగ్రెస్-బీఆర్ఎస్ కార్యకర్తల చర్చ

బోరబండలో బీఆర్ఎస్ vs కాంగ్రెస్ కార్యకర్తల మధ్య చిన్నపాటి ఫైటింగ్ సాగింది. బోరబండ కార్పొరేటర్‌పై బీఆర్ఎస్ కార్యకర్త చేయి చేసుకున్నట్లు ఆరోపణలు వెల్లువెత్తాయి. బీఆర్ఎస్ డివిజన్ నాయకులను పోలింగ్ బూత్‌ల వద్దకు అనుమతిస్తున్నారంటూ గొడవ పెట్టుకున్నారు కాంగ్రెస్ పార్టీ షేక్‌పేట డివిజన్ అధ్యక్షుడు సత్యనారాయణ. ఈ క్రమంలో ఆయన పోలీసులతో వాగ్వాదం దిగారు.