🙏 ఓం శ్రీ గురుభ్యోనమః 🙏
🌷పంచాంగం🌷
శ్రీరస్తు – శుభమస్తు – అవిఘ్నమస్తు,
తేదీ … 11 – 11 – 2025,
వారం … భౌమవాసరే ( మంగళవారం )
శ్రీ విశ్వావసు నామ సంవత్సరం,
దక్షిణాయనం,
శరదృతువు,
కార్తీక మాసం,
బహుళ పక్షం,
తిథి : *షష్ఠి* ఉ6.10 వరకు
తదుపరి *సప్తమి* తె4.55 వరకు,
నక్షత్రం : *పుష్యమి* రా12.39 వరకు
యోగం : *శుభం* సా4.36 వరకు
కరణం : *వణిజ* ఉ6.10 వరకు
తదుపరి *భద్ర* సా5.33 వరకు,
ఆ తదుపరి *బవ* తె4.55 వరకు,
వర్జ్యం : *ఉ9.09 – 10.42*
దుర్ముహూర్తము : *ఉ8.21 – 9.06*
మరల *రా10.27 – 11.18*
అమృతకాలం : *సా6.27 – 8.00*
రాహుకాలం : *మ3.00 – 4.30*
యమగండం : *ఉ9.00 – 10.30*
సూర్యరాశి : *తుల*
చంద్రరాశి : *కర్కాటకం*
సూర్యోదయం : *6.06*
సూర్యాస్తమయం : *5.22*
*_నేటి మాట_*
*చేసే దానం ఎలా ఉండాలి??*
“దానం అనేది ఒక బాధ్యత! మంచి సమయంలో, మంచి ప్రదేశంలో, మంచి ఉద్దేశంతో, సరైన వాడికి తిరిగి ప్రతిఫలం ఆశించకుండా చేసిన దానాన్ని ‘సాత్విక దానం’ అంటారు!
ప్రతిఫలం ఆశించి, మళ్ళి తిరిగి రావాలనే భావంతో, బలవంతంతో, డంబము, పేరుకోసం మోహమాటంగా ఇష్టం లేకున్నా చేసే దానాన్ని ‘రాజసిక దానం’ అంటారు!
సందర్భమే లేకున్నా, అనువుకాని చోట, యోగ్యత లేని వారికి, అగౌరవంగా, అవమానకరంగా ఇచ్చే దానాన్ని ‘తామసిక దానం’ అంటారు.
ఈ కాలంలో చాలా మంది చేసేవి రాజసిక దానాలే! ఒకరికి సహాయం చేస్తే ప్రత్యక్షంగా కాని పరోక్షంగా కాని తిరిగి మనకేమైనా రావాలి అనే భావంతో చేసేవే!
ఫలాపేక్ష లేకుండా దానం చేసే వాళ్ళు ఈ కాలంలో అరుదు!
ఇచ్చే దానం నేను ఇస్తున్నా అనే తలపు నుండి ఏది నాది? ఏది ఎవరిది? అనే ప్రశ్నల నుండి అంతా పరమాత్మునివే..
నేను, నాప్రాణం, నా ఆస్తి, నా కుటుంబం, నాది ఇలా అన్ని ఆ పరమాత్మునిలోవే, దేనికీ మనం యజమానులం కాదు అనే భావన పూర్తిగా వచ్చాక చేసే దానం చాలా గొప్పది!
అప్పుడు జీవితంలో కూడికలు ఉండవు! తీసివేతలు ఉండవు! అప్పుడు చేసే ప్రతీ పనిలో ఆనందంగా ఉంటారు!
*_🌷శుభమస్తు🌷_*
🙏 సమస్త లోకా సుఖినోభవంతు 🙏