జూబ్లీహిల్స్ అసెంబ్లీ నియోజకవర్గానికి నవంబర్ 11న జరగనున్న పోలింగ్.

జూబ్లీహిల్స్ అసెంబ్లీ నియోజకవర్గానికి నవంబర్ 11న జరగనున్న పోలింగ్.

నవంబర్ 14 న జరగనున్న కౌంటింగ్

అక్టోబర్ 13న నోటిఫికేషన్…

అక్టోబర్ 21 నామినేషన్ల స్వీకరణకు చివరి తేదీ.

నామినేషన్ ల ఉపసంహరణకు చివరి తేదీ అక్టోబర్ 24..

దేశంలోని 8 అసెంబ్లీ స్థానాల ఉప ఎన్నికకు షెడ్యూల్ రిలీజ్ అయ్యింది. వివిధ కారణాలతో ఖాళీ అయిన 8 స్థానాలకు ఉప ఎన్నికలు నిర్వహించేందుకు కేంద్ర ఎన్నికల సంఘం సోమవారం (అక్టోబర్ 6) షెడ్యూల్ విడుదల చేసింది. ఈ 8 అసెంబ్లీ సెగ్మెంట్లకు 2025, నవంబర్ 11న ఉప ఎన్నికలు నిర్వహించనున్నట్లు ఈసీ స్పష్టం చేసింది. 2025, నవంబర్ 14న ఫలితాలు వెలువడనున్నాయి. బీహార్ అసెంబ్లీ ఎన్నికలకు కూడా ఈసీ షెడ్యూల్ విడుదల చేసిన విషయం తెలిసిందే. బీహార్‎లోని 243 అసెంబ్లీ స్థానాలకు రెండు దశల్లో ఎన్నికలు జరగనున్నాయి. 2025, నవంబర్ 6, 11వ తేదీల్లో బీహార్ ఎన్నికల పోలింగ్ నిర్వహించనుంది ఈసీ…