జూన్ 1 నుంచి అమల్లోకి కొత్త రూల్స్.!

మే నెల ముగింపుకు వచ్చేసింది, మరో రెండు రోజుల్లో జూన్ నెల ప్రారంభం కానుంది, అయితే జూన్ 1వ తేదీ నుండి దేశవ్యాప్తంగా అనేక కీలక కొత్త నిబంధనలు అమల్లోకి రానున్నా యి,దేశ ప్రజలను ప్రభావితం చేసే అనేక మార్పులు అమల్లోకి వస్తాయి.ఆర్ధికపరంగా, ఇతర విషయాల్లో అనేక కొత్త మార్పులు చోటుచేసుకుంటాయి.

ఇక బ్యాంక్ సెలవుల తో పాటు… నెల మారుతుందంటే.. ఎల్పీజీ గ్యాస్ ధరల్లో సవరణలు జరుగుతా యి. ప్రతీ నెలా ఒకటో తేదీన చమురు కంపెనీలు కొత్త గ్యాస్ ధరలను ప్రకటిస్తాయి. గత మూడు నెలలుగా ధరలను పెంచగా.. ఈ సారి గ్యాస్ ధరలు ఎలా ఉంటాయనేది, చర్చనీయాంశంగా మారింది. ఈ సారి కూడా పెంచుతారా? లేదా?స్థిరంగా ఉంచు తారా అనేది హాట్ టాపిక్‌గా మారింది.

జూన్ 1వ తేదీ నుంచి ప్రముఖ ప్రైవేట్ బ్యాంక్ అయిన హెచ్‌డీఎఫ్‌సీ కొన్ని అకౌంట్ల మెయింటైన్ రూల్స్ మార్చుతోంది. అందులో భాగంగా నోట్లు, కాయిన్స్ డిపాజిట్ల మీద చార్జీలు విధించనుంది. నోట్స్ డిపాజిట్‌పై 4 శాతం, కాయిన్ డిపాజిట్లపై 5 శాతం ఛార్జీలు విధించనుంది. అలాగే రూ.20 నోట్లు రూ.10 వేలు దాటకూ డదు. ఇక కాయిన్స్ డిపాజిట్ రూ.5 వేలు దాటకూడదు.

లిమిట్ దాటితే హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ 2 శాతం అదనంగా ఛార్జీ విధించనుంది. ఇక జూన్ 1 నుంచి సోలార్ ప్యానెళ్ల నిబంధనల్లో కేంద్రం మార్పులు చేసింది. ఇక నుంచి ప్రభుత్వం ఆమోదించిన సోలార్ ప్యానెళ్లు మాత్రమే వాడాలి. అప్పుడు మాత్రమే ప్రభుత్వ సబ్సిడీ అందుతుంది. దీని వల్ల జూన్ నుంచి సోలార్ ప్యానెళ్ల ధర లు పెరిగే అవకాశ ముందని తెలుస్తోంది…

పీఎన్‌జీ మౌలిక సదుపాయాలు ఉన్న ప్రాంతాల్లో నివసిస్తూ.. ఇప్పటికీ ఎల్‌పీజీ వాడుతున్న వారు నిర్ణీత గడువులోగా మారకపోతే వారి ఎల్‌పీజీ సరఫరా నిలిచిపోతుంది లేదంటే రద్దవుతుంది. పైప్‌లైన్ గ్యాస్ యాక్టివ్‌గా ఉన్న ఇళ్లకు సిలిండర్లను బుక్ చేసుకోకుండా ఉండేలా ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలు, సిటీ గ్యాస్ డిస్ట్రిబ్యూషన్ నెట్‌వర్క్‌లు తమ డిజిటల్ డేటాబేస్‌లను అనుసంధానించాయి. ఫలితంగా అలాంటి వారికి రీఫిల్ బుకింగ్స్ బ్లాక్ అవుతాయి.

అయితే వినియోగదారులకు ఊరటనిచ్చేలా ‘ఎల్‌పీజీ కనెక్షన్ ట్రాన్స్‌ఫర్ ఓచర్’ సదుపాయాన్ని ప్రభుత్వం అందుబాటులోకి తెచ్చింది. దీంతో పీఎన్‌జీ కనెక్షన్ వచ్చిన 30 రోజుల్లోగా ఎల్‌పీజీని వదులుకోవాల్సి ఉన్నప్పటికీ, భవిష్యత్తులో పీఎన్‌జీ సౌకర్యం లేని ప్రాంతాలకు మారినప్పుడు ఈ ఓచర్ ద్వారా ఎల్‌పీజీ కనెక్షన్‌ను మళ్లీ పునరుద్ధరించుకోవచ్చు. అలాగే సిలిండర్ల దుర్వినియోగాన్ని అరికట్టేందుకు రీఫిల్ బుకింగ్ లాక్-ఇన్ పీరియడ్‌ను పట్టణ ప్రాంతాల్లో 21 రోజుల నుండి 25 రోజులకు, గ్రామీణ ప్రాంతాల్లో 45 రోజులకు పెంచింది కేంద్ర ప్రభుత్వం.

ప్రభుత్వం ఏడాదికి అందించే 12 సబ్సిడీ సిలిండర్ల పరిమితి యథాతథంగా కొనసాగుతుంది. అదనపు సిలిండర్లకు మార్కెట్ ధర చెల్లించాల్సి ఉంటుంది. కొత్త ఎల్‌పీజీ కనెక్షన్ ధరలు, డిపాజిట్లు కూడా సవరించబడ్డాయి. పీఎన్‌జీ విస్తరణను మరింత వేగవంతం చేయడానికి నేషనల్ పీఎన్‌జీ డ్రైవ్ 2.0 గడువును జూన్ 30 వరకు పొడిగించారు. ఇటు కఠిన నిబంధనలు, అటు డిజిటల్ పర్యవేక్షణ ద్వారా దేశవ్యాప్తంగా వంటగ్యాస్ వినియోగంలో పెద్ద మార్పు తీసుకురావడానికి ప్రభుత్వం వేగంగా అడుగులు వేస్తోంది. సో ఇకపై ఒకే ఇంటికి సిలిండర్లు, పైప్డ్ గ్యాస్ కనెక్షన్ ఏకకాలంలో కొనసాగించటం అస్సలు కుదరదన్నమాట