సింగరేణి, ప్రభుత్వ ఆస్తులను ధ్వంసం చేయాలని మాట్లాడిన బీఆర్ఎస్ పార్టీ కీలక నేత బాల్క సుమన్ను అరెస్ట్ చేసేందుకు పోలీసులు తెలంగాణ భవన్ దగ్గరకు వెళ్లారు. ఈ నేపథ్యంలో తెలంగాణ భవన్ దగ్గర ఉద్రిక్తత చోటుచేసుకుంది. బీఆర్ఎస్ భవన్లో ఉన్న బాల్క సుమన్ను అదుపులోకి తీసుకునేందుకు పోలీసులు లోపలికి వెళ్లేందుకు ప్రయత్నించారు. దీంతో బీఆర్ఎస్ కార్యకర్తలు వారిని అడ్డుకున్నారు. పోలీసులతో వాగ్వాదానికి దిగారు. పోలీసులు గో బ్యాక్ అంటూ నినాదాలు చేశారు. బీఆర్ఎస్ కార్యకర్తలను పోలీసులు చెదరగొడుతున్నారు. ప్రస్తుతం తెలంగాణ భవన్ పోలీసుల దిగ్బంధంలో ఉంది.
అంతేకాకుండా, రాష్ట్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా కార్యకర్తలందరూ మిలిటెంట్ తరహాలో ఉధృత పోరాటాలు చేయాలని ఆయన పిలుపునిచ్చారు. శాంతిభద్రతలకు విఘాతం కలిగించేలా, ప్రభుత్వ ఆస్తులను ధ్వంసం చేయాలనే ఉద్దేశంతో ఈ వ్యాఖ్యలు ఉన్నాయంటూ నమోదైన కేసుల ఆధారంగానే పోలీసులు ఈ రోజు ఆయనను అదుపులోకి తీసుకున్నారు. బాల్క సుమన్ అరెస్ట్ వార్తతో నాంపల్లి కోర్టు పరిసరాల్లో పోలీసుల బందోబస్తును భారీగా పెంచారు.
మరోవైపు తన అరెస్ట్ వార్తలను మాత్రం బాల్క సుమన్ ఖండించారు. తాను తెలంగాణ భవన్లోనే ఉన్నానని, అరెస్టు చేస్తే చట్టపరంగా ఎదుర్కొంటానని తెలిపారు..