ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్పై మాజీ మంత్రి కడియం శ్రీహరి స్పందించారు. సుప్రీం కోర్టులో ఉన్న MLAల అనర్హత కేసుపై ఈ నెల 10న తీర్పు వెలువడనుంది..ఈ తీర్పును తాను తప్పకుండా శిరసావహిస్తానని ఆయన స్పష్టంగా తెలిపారు. కోర్టు తీర్పు ప్రకారం ఉపఎన్నికలు జరిగితే, తాను తప్పకుండా పోటీ చేస్తానని, వెనక్కి తగ్గే ప్రసక్తే లేదని పేర్కొన్నారు. ఇందులో వెనుకడుగు తీసుకునే ఆలోచన లేదని కడియం శ్రీహరి స్పష్టం చేశారు. BRS పార్టీపై తీవ్ర విమర్శలు చేసిన కడియం శ్రీహరి, BRS స్వార్థపరమైన రాజకీయాలు చేస్తోందని, ఫిరాయించిన MLAలను మంత్రులుగా చేసిన ఘనత కూడా BRSదే అంటూ విమర్శలు గుప్పించారు. ప్రస్తుతం BRS నాయకులు సుద్ధపూసలాగా మాట్లాడుతున్నారని ఎద్దేవా చేశారు.
Sign in
Sign in
Recover your password.
A password will be e-mailed to you.