తండ్రి కొట్టడంతో కొడుకు మృతి..!

తండ్రి కొట్టడంతో విద్యార్థి మృతి..!

చౌటుప్పల్ మండలం ఆరెగూడెం గ్రామానికి చెందిన కట్ట సైదులు గత కొంతకాలంగా చౌటుప్పల్ పట్టణ కేంద్రంలోని బంగారుగడ్డలో సొంత ఇంట్లో నివాసం ఉంటున్నారు.
-కట్ట సైదులుకు ముగ్గురు కుమారులు. చిన్న కుమారుడు కట్ట బాను ప్రకాష్ (14) ప్రవేట్ పాఠశాలలో 9వ తరగతి చదువుతున్నాడు. నిన్న పాఠశాలలో ఫేర్వెల్ పార్టీ ఉండడంతో పాఠశాలకు వెళ్లి ఇంటికి ఆలస్యంగా వచ్చాడు
-అప్పటికే మద్యం మత్తులో ఇంటికి చేరుకున్న తండ్రి సైదులు ………భాను ఇంటికి ఆలస్యంగా రావడంతో మందలించే క్రమంలో అతని కొట్టాడు.
-భాను ని విపరీతంగా కొట్టడంతో అపస్మారక స్థితిలోకి వెళ్ళాడు…
– వెంటనే చౌటుప్పల్ ప్రభుత్వాసుపత్రికి తీసుకెళ్లగా అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు.
– విద్యార్థి భాను మృతదేహానికి అంత్యక్రియలు నిర్వహించడానికి ఆదివారం తెల్లవారుజామున స్వస్థలం ఆరెగూడెం గ్రామానికి తీసుకువచ్చారు.
– ఈ విషయాన్ని సమాచారం అందుకున్న పోలీసులు అంత్యక్రియలు నిర్వహించకుండా, మృతదేవానికి పోస్టుమార్టం చేయాలని చెప్పడంతో అంత్యక్రియలు నిలిచిపోయాయి.
– పోలీసులు అంబులెన్స్ సహాయంతో పోస్టుమార్టం మృతదేవాన్ని చౌటుప్పల్ ప్రభుత్వాసుపత్రికి తరలించారు.
– ప్రభుత్వ ఆసుపత్రి వద్ద చౌటుప్పల్ సిఐ మన్మధ కుమార్ జరిగిన సంఘటనపై ఆ కాలనీవాసులతో అడిగి తెలుసుకున్నారు. తండ్రి కొట్టడంతోనే విద్యార్థి మృతి చెందారని నిర్ధారించుకొని ఆ కోణంలో కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు సమాచారం.
– పోస్టుమార్టం అనంతరం అంత్యక్రియలను స్వగ్రామం ఆరెగూడెం గ్రామంలో నిర్వహించారు..