సూర్యాపేట జిల్లా మేళ్లచెరువు మండలం రామాపురం గ్రామంలో నకిలీ మద్యం తయారు చేసే ముఠా అరెస్ట్
ఆరుగురు నిందితులపై కేసు నమోదు ఇద్దరిని అదుపులోకి తీసుకోగా నలుగురు నేరస్తుల పరార్.
మేళ్లచెరువు మండలంలోని పలు ప్రాంతాల్లో వైన్ షాపుల్లో..
హుజూర్ నగర్ ఎక్సైజ్ పోలీసులతో పాటు టాస్క్ ఫోర్స్ అధికారుల సోదాలు.
15 లక్షల రూపాయల విలువైన నకిలీ మద్యం తో పాటు స్పిరిట్ ఖాళీ సీసాలు పట్టివేత.
సూర్యాపేట జిల్లా మేళ్లచెరువు మండలంలోని పలు ప్రాంతాల్లో తెలంగాణ ఎక్సైజ్ స్టేట్ టాస్క్ ఫోర్స్ సూపరిండెంట్ అంజిరెడ్డి ఆధ్వర్యంలో హుజూర్నగర్ ఎక్సైజ్ సీఐ నాగార్జున రెడ్డి అండ్ టీమ్ జరిపిన దాడుల్లో మేళ్లచెరువు మండలం రామాపురం ఓ గోదాంలో నకిలీ మద్యం తయారు చేస్తున్న ముఠాను పట్టుకున్నారు.
ఇట్టి కేసు లో తోట శివ శంకర్ తో పాటు
దుర్గి కి చెందిన శ్రీరాం మహేష్
షెడ్ ఓనర్ సూర్య ప్రకాష్ పై కేసు నమోదు కాగా…మొదటి వ్యక్తి పరారీ లో వుండగా మిగిలిన వారిని అరెస్టు చేయడమైనది
వీరికి స్పిరిట్ లేబుల్స్ కాప్స్ సప్లై చేసిన హైదరాబాద్ కు చెందిన రూతుల శ్రీనివాస్ తో పాటు శ్రీ కృష్ణా ఫార్మా కు చెందిన శివ చరణ్ సింగ్ పై కూడా కేసు నమోదు చేయడమైనది.
వారి వద్ద సుమారు 15 లక్షల రూపాయల విలువైన నకిలీ మద్యాన్ని గుర్తించి పట్టుకున్నారు అంతే కాకుండా సుమారు రెండు కోట్ల విలువైన నకిలీ మద్యాన్ని తయారు చేసే స్పిరిట్ తో పాటు కాళీ సీసాలను స్వాధీనం చేసుకొని హుజూర్నగర్ ఎక్సైజ్ పోలీస్ స్టేషన్ కు తరలించారు.
నకిలీ మద్యం ముఠాకు సంబంధించి ఆరుగురుపై కేసు నమోదు చేయగా ఇద్దరిని అదుపులోకి తీసుకున్నట్టు మిగతా నలుగురు పరారీలో ఉన్నట్లు తెలిపారు.
మేళ్లచెరువు మండలం తో పాటు చింతలపాలెం మండలాల్లో అక్రమ మద్యం తయారీపై నిఘా ఏర్పాటు చేసినట్లు ఈ సందర్భంగా తెలిపారు.
నిందితులు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం తో పాటు తెలంగాణ లోని పలు ప్రాంతాలకు మద్యాన్ని సరఫరా చేసినట్లు తెలిపారు.
హైదరాబాద్ నుండి స్పిరిట్ తీసుకువచ్చి తెలంగాణ ఏపీ సరిహద్దుల్లో నకిలీ మద్యం తయారు చేస్తూ ప్రముఖ బ్రాండ్ల పేరుతో మద్యాన్ని అమ్ముతున్నట్లు గుర్తించారు.
గతంలో ఏపీలోని మార్కాపురం రేపల్లె అమలాపురం తో పాటు మరికొన్ని చోట్ల ఈ ముఠా మద్యం అమ్మినట్లు తెలిపారు.
ప్రధానంగా మేళ్లచెరువు మండల కేంద్రంలో కౌంటర్ విధులు నిర్వహిస్తున్న శంకర్ తో పాటు మరి కొంతమంది ముఠాగా ఏర్పడి నకిలీ మద్యాన్ని తయారు చేస్తున్నట్లు గుర్తించి వారిని అదుపులో తీసుకొని విచారించగా విషయం బయట పడ్డట్లు తెలంగాణ ఎక్సైజ్ స్టేట్ టాస్క్‌ఫోర్స్ సూపరిండెంట్ అంజిరెడ్డి తెలిపారు.ఈ కార్యక్రమంలో ఎక్సైజ్ ఎస్సై జగన్మోహన్ రెడ్డి, ఎస్సై వెన్నెల, ఎక్సైజ్ పోలీసులు రవి, నాగరాజ్, నాగన్న, తదితరులు పోలీసులు ఉన్నారు..
గమనిక..
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో మాకు పంపించండి.. మేము మీ పేరుతో వార్తను ప్రచురిస్తాం…
Watsapp no..9133057959