కమలహాసన్కు రాజ్యసభ బరిలో అవకాశం — డీఎంకే తరఫున అభ్యర్థిగా ప్రకటించిన స్టాలిన్.
తమిళనాడు రాజకీయాల్లో ప్రముఖ నటుడు కమలహాసన్ కు మరో కీలక మలుపు లభించింది. డీఎంకే అధినేత, తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్ కమలహాసన్ను రాజ్యసభ అభ్యర్థిగా ప్రకటించారు.
ఇది డీఎంకే – మక్కల్ నీది మయ్యం (ఎంఎన్ఎం) మధ్య గతంలో జరిగిన ఒప్పందానికి అనుగుణంగా తీసుకున్న నిర్ణయంగా పార్టీ వర్గాలు తెలిపాయి. ప్రస్తుతం ఖాళీగా ఉన్న నాలుగు రాజ్యసభ స్థానాల్లో ఒక సీటును ఎంఎన్ఎంకి కేటాయిస్తూ డీఎంకే ఈ కీలక ప్రకటన చేసింది.
ఈ నిర్ణయం ద్వారా కమలహాసన్కి జాతీయ రాజకీయాల్లోకి అడుగుపెట్టే దారులు మరింత వెడల్పయ్యే అవకాశం ఉందని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.