పాక్ కు గూడచారి గా పనిచేస్తున్న సిఆర్పిఎఫ్ ఉద్యోగి నీ అరెస్టు చేసిన నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ..
ఢిల్లీకి చెందిన సిఆర్పిఎఫ్ ఉద్యోగి మోతీరామ్ జాట్ 2023 నుంచి పాకిస్తాన్ ఇంటిలిజెన్స్ ఆఫీసర్స్ తో సంబంధాలు నడుపుతున్నాడు._
_• జాతీయ భద్రతకు సంబంధించిన సమాచారాన్ని పాకిస్తాన్ ఇంటిలిజెన్స్ ఆఫీసర్స్ కు అందజేస్తున్నాడు._
_• అందుకు ప్రతిఫలంగా పాకిస్తాన్ ఇంటెలిజెన్స్ అధికారుల నుంచి వివిధ రూపాల్లో నగదు అందుకున్నాడు._
_• మోతీరాం ను అరెస్టు చేసి ప్రత్యేక కోర్టులో హాజరు పరిచాము._
_• జూన్ ఆరో తేదీ వరకు న్యాయస్థానం నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ కస్టడీ కి అప్పగించింది._
_• మోతీ రామ్ విచారణ కొనసాగుతోంది._
_• ఎన్ఐఏ అధికారిక ప్రకటన._
సెంట్రల్ రిజర్వు పోలీసు దళం (సీఆర్పీఎఫ్) జవాను మోతీ రామ్ జాట్ను జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్ఐఏ) అరెస్ట్ చేసింది. ఆయనను న్యూఢిల్లీలోని పాటియాలా హౌస్లోని ప్రత్యేక ఎన్ఐఏ కోర్టు వచ్చే నెల 6 వరకు ఎన్ఐఏ కస్టడీకి ఆదేశించింది. ఎన్ఐఏ విడుదల చేసిన ప్రకటనలో తెలిపిన వివరాల ప్రకారం, మోతీ రామ్ 2023 నుంచి పాకిస్థాన్ ఇంటెలిజెన్స్ సంస్థకు భారత దేశ భద్రతకు సంబంధించిన సున్నితమైన సమాచారాన్ని రహస్యంగా పంపిస్తున్నాడు..అందుకు బదులుగా పాకిస్థానీ సంస్థ నుంచి వివిధ మార్గాల్లో నిధులు తీసుకుంటున్నాడు. ఈ ఆరోపణలు దేశ భద్రత, భారతీయులు, దేశానికి వచ్చే ప్రజల ప్రాణాలపై ప్రభావం చూపుతాయని ప్రత్యేక కోర్టు వ్యాఖ్యానించింది..