అన్నమయ్య జిల్లా:
రాజంపేట (మం) ఊటుకూరు (ఉడుమూరు) గ్రామంలో సినీ నటుడు మంచి విష్ణు సందడి చేశారు.. భక్తకన్నప్ప జన్మస్థలం ఊటుకూరు శివాలయాన్ని, శ్రీ ఆంజనేయ స్వామి ఆలయాలను మంచు విష్ణు,కన్నప్ప సినీ బృందం దర్శించుకున్నారు..
ఆలయ మర్యాదలతో పూర్ణకుంభ స్వాగతాన్ని ఊటుకూరు శివాలయం కమిటీ సభ్యులు పలికారు. భక్త కన్నప్పకు జన్మస్థలి (అలనాటి ఉడుమూరు) నేటి ఊటుకూరు కావడం..కన్నప్ప చిత్రాన్ని సినిమాగా తీసిన సినీ నటులు సినీ బృందాన్ని చూడటానికి
పెద్ద ఎత్తున తరలి వచ్చినారు చిన్నా పెద్ద..వందలాది మంది గ్రామస్తులు….
ఈ సందర్బంగా మంచు విష్ణు కామెంట్స్ ఇలా ఉన్నాయి.. భక్త్జి శ్రద్దలతో కన్నప్ప చిత్రాన్ని తీస్తున్నాను….ఆ కన్నప్ప ఆశీస్సులు నాకు,మా చిత్రానికి ఉండాలని ఆలయాన్ని దర్శించుకున్నాను…. ఏప్రిల్ 25న కన్నప్ప చిత్రాన్ని రిలీజ్ చేస్తున్నాను…. మా ఈ చిత్రం విడుదలైన తర్వాత ఆలయ అభివృద్ధి సహాయం చేస్తాను..అని తెలిపారు… మంచు విష్ణు వెంట శ్రీకాళహస్తి దేవస్థాన మాజీ చైర్మన్ బిజెపి నేత కోలా ఆనంద్ పాల్గొని ఆలయాన్ని సందర్శించి పూజా కార్యక్రమాలు నిర్వహించారు…