కర్ణాటకలో ఘోర రోడ్డు ప్రమాదం..

కర్ణాటకలో ఘోర రోడ్డు ప్రమాదం..
ప్రైవేట్ ట్రావెల్స్ బస్సును ఢీకొట్టిన లారీ.. ఢీకొట్టిన తర్వాత బస్సులో చెలరేగిన మంటలు.. 18 మందికి పైగా మృతి చెందినట్లు అనుమానం.. మంటల్లో పూర్తిగా కాలి బూడిదైన ట్రావెల్స్ బస్సు.. బెంగళూరు నుంచి శివమొగ్గ వెళ్తుండగా ఘటన.. హిరియూర్ లోని గోర్లట్లు వద్ద జరిగిన ప్రమాదం.. ఉదయం 3గంటల ప్రాంతంలో ఘటన..

ప్రమాద సమయంలో బస్సులో 32 మంది ప్రయాణికులు ఉన్నారు. చిత్రదుర్గ, తుమకూరు జిల్లాల పరిధిలోని అధికార యంత్రాంగం ఘటనాస్థలికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. ప్రమాదానికి అతివేగం, పొగమంచు కారణమని భావిస్తున్నారు. బస్సుతో పాటు కంటెయినర్ లారీకి కూడా మంటలు వ్యాపించాయి. ప్రమాదం జరిగిన వెంటనే బస్సు డ్రైవర్, కో డ్రైవర్ అందులోంచి దూకి తప్పించుకున్నారు. మరికొందరు ప్రయాణికులు అద్దాలను పగులగొట్టి ప్రాణాలు కాపాడుకున్నారు. వారిలో గగన, రక్షిత అనే యువతులు ఉన్నారు. తమ స్నేహితురాలు రష్మి కనిపించడం లేదని వారు కన్నీరుమున్నీరయ్యారు. ప్రయాణికుల్లో కొంతమందికి గాయాలు కావడంతో వారిని సిరా, హిరాయూరు ఆస్పత్రులకు తరలించి చికిత్స అందిస్తున్నారు.

ప్రయాణికుల్లో కొందరి పేర్లను అధికారులు గుర్తించారు. ఆ వివరాల ప్రకారం.. బస్సులో మంజునాథ్, సంధ్య, శశాంక్, దిలీప్, ప్రీతీశ్వరన్, వి బిందు, కె కవిత, అనిరుధ్ బెనర్జీ, అమృత, కల్పన, ప్రజాపతి, ఎం శశికాంత్, విజయ్ భండారీ, నవ్య, అభిషేక్, హెచ్. కిరణ్పాల్, ఎం.కీర్తన్ ఉన్నట్లు తెలుస్తోంది..

హిరియూరులోని ఆస్పత్రిలో 12 మందికి చికిత్స అందిస్తున్నారు.