సమస్య పరిష్కరించమని అడిగితే ప్రైవేట్ గదికి తీసుకెళ్లి మహిళపై అనుచితంగా పోలీసు అధికారి..

న్యాయం చేయాలంటూ ఆశ్రయించిన మహిళ పట్ల అనుచితంగా ప్రవర్తించాడు పోలీసు అధికారి. కర్నాటక లోని మధుగిరి డివైఎస్పీ రామచంద్రప్పకు కంప్లైంట్ ఇచ్చేందుకు కార్యాలయానికి వచ్చిన ఓ మహిళ పట్ల అనుచితంగా ప్రవర్తించారు…కర్నాటక పోలీసు డిపార్ట్‌మెంట్‌ను కుదిపేస్తూ సదరు అధికారి చర్యలకు సంబంధించిన వీడియో ఒకటి వైరల్‌గా మారింది.
ఈ ఘటన కర్ణాటక హోంమంత్రి రామేశ్వర్ సొంత జిల్లా తుమకూరులో చోటుచేసుకుంది. భూమి వివాదానికి సంబంధించి ఆ మహిళ పావగడ నుంచి కార్యాలయానికి వచ్చింది. అధికారి ఆమెను ఓ ప్రైవేట్ గదికి తీసుకెళ్లి అనుచితంగా ప్రవర్తించాడని, ఆమెతో పాటు వచ్చిన అనిల్ అనే వ్యక్తి రికార్డు చేసిన వీడియో వాట్సాప్‌లో విస్తృతంగా షేర్ అవుతోంది..
https://x.com/HateDetectors/status/1875083297627488589?ref_src=twsrc%5Etfw%7Ctwcamp%5Etweetembed%7Ctwterm%5E1875083297627488589%7Ctwgr%5E1bccd546471abbfef3a684e0cb4015b03f4bdb29%7Ctwcon%5Es1_c10&ref_url=http%3A%2F%2Fapi-news.dailyhunt.in%2F
వీడియో సర్క్యులేషన్ తరువాత రామచంద్రప్ప అజ్ఞాతంలోకి వెళ్లిపోయారు. ఈ సంఘటన పట్ల ప్రజల ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అధికారిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈ ఘటన దురదృష్టకరం అని పేర్కొంటూ తుమకూరు ఎస్పీ అశోక్ మాట్లాడుతూ.. ఇది తీవ్రమైన విషయం. సీనియర్‌ అధికారులకు సమాచారం అందించామని, సమగ్ర దర్యాప్తు జరుపుతామని వెల్లడించారు…